జగిత్యాల మున్సిపల్ ఇంచార్జ్ చైర్మన్ గా!
వైస్ చైర్మన్ కు బాధ్యతలు!

చైర్మన్ పదవి రాజీనామా ఆమోదం!

ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్!

J.Surender Kumar,

జగిత్యాల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా కొనసాగుతున్న గోలి శ్రీనివాస్ కు ఇంచార్జ్ చైర్మన్ గా విధులు నిర్వహించడానికి బాధ్యతులు అప్పగిస్తూ సోమవారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

నూతన మున్సిపల్ పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి చైర్మన్ గా ఎన్నికై బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ భోగ శ్రావణి, ఈనెల 25న తన చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ మీడియా సమావేశంలో వెల్లడించారు. చైర్మన్ శ్రావణి రాజీనామాను. కలెక్టర్ బి రవి సోమవారం తన చాంబర్ లో. ఆమెతో చర్చించి ఆమె చేసిన రాజీనామాను నిర్ధారించుకున్నారు.

ఈ మేరకు ప్రొసీడింగ్ నెంబర్ 381/C/2023, 30 జనవరి 2023 ద్వారా వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ కు జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగిస్తూ, విధుల నిర్వహణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నూతన మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక కొనసాగే వరకు. వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ చైర్మన్ బాధ్యతలు నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేశారు.


ఈ మేరకు కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల ఉత్తర్వులను ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్. డాక్టర్ బోనగిరి నరేష్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ కు అందజేశారు
.