L.M కొప్పుల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో..
J.Surender Kumar,
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామంలో LM కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హాప్ హైదరాబాద్, సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగావైద్య శిబిరాన్నిలో 1185 మందికి వైద్య సేవలు అందించారు. ఈ శిబిరాన్ని ఎల్.ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహాలత ప్రారంభించారు.

శనివారం మెగా వైద్య శిబిరంలో పరిసర గ్రామాలు బంజేరుపల్లి, చామనపల్లి, ధర్మారం, కొత్తపల్లి తాండ, పెరుకపల్లి, కుమ్మరికుంట, ఎర్రగుంట పల్లి, బొమ్మిరెడ్డి పల్లె, నుండి పెద్దసంఖ్యలో ప్రజలు వైద్య సేవల కోసం తరలివచ్చారు.

మొత్తం 1185 మందికి అందించిన వైద్య సేవల లో 294 మందికి రోగ నిర్దారణ పరీక్షలు, 48 మందికి ఎక్స్ రేలు, 127 మందికి ఈ.సి.జీ పరీక్షలు, 453 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 136 మందికి కళ్ళజోల్లను పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కారుపాక రాజయ్య, యం పి టి సి ముత్యాల కరుణ శ్రీ, జెడ్పీటీసీ పుస్కురి పద్మజ, PACS ఛైర్మన్ లు బలరాం రెడ్డి, నోముల వెంకటేష్ రెడ్డి, .

మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మోహన్ రెడ్డి, మండల మహిళ అధ్యక్షురాలు కనకలక్ష్మీ, వివిధ గ్రామాల సర్పంచ్ లు, యంపిటిసిలు, ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హాప్ డాక్టర్ లు, వైద్యులు, RMP వైద్యులు, ఆశ కార్యకర్తలు స్థానిక వైద్య సిబ్బందితో పాటు హాస్పిటల్ నుండి వచ్చిన వైద్యులు, LM కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సభ్యులు సేవలు అందించారు.
