మూడు కిలోల బంగారం స్వాధీనం!
అప్పుల ఎగవేత కేసులో నిందితుడు!
J.Surender Kumar,
జగిత్యాల పట్టణంలో దాదాపు ₹ 5 కోట్లకు పైగా అప్పులు చేసి 18 నెలల క్రితం పారిపోయిన పోచమ్మవాడ కు చెందిన రేగొండ నరేష్ ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు జగిత్యాల డిఎస్పీ రత్నపురం ప్రకాష్ తెలిపారు.
డీఎస్పీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
నిందితుని నుండి 3 కిలోల 350 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పి వివరించారు.

2021 అక్టోబర్ నెలలో జగిత్యాల నుండి అదృశ్యమైన వ్యాపారి రేగొండ నరేష్ కోసం జిల్లా పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలు, బాధితుల్లో ఒకరు హైదరాబాదులో మాటు వేసి పట్టుకోవడం, తెలిసిన విషయం.
గత రెండు రోజుల క్రితం పోలీస్ ల అదుపులో నుంచి అదృశ్యం కావడంతో పోలీస్ యంత్రాంగం ఛాలెంజ్ గా , పకడ్బందీ పథకం రచించి 24 గంటలలో నిందితుడు నరేష్ ను అరెస్టు చేయడంతో పాటు అతడి వద్ద నుండి బంగారంను స్వాధీనం చేసుకోవడంతో బాధితులు, పట్టణ ప్రజలు, జగిత్యాల పోలీస్ యంత్రాంగంను అభినందిస్తున్నారు.
