ఉపాధ్యాయుల బదిలీలలో జీరో సర్వీస్ కు అవకాశం కల్పించాలి!

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి మెమోరాండం!

ఆదిలాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం!

J. Surender Kumar,

317 G.O. ద్వారా నష్టపోయి మారుమూల గిరిజన ప్రాంతాలలో పనిచేస్తున్న గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు బదిలీల ప్రక్రియలో కనీస సర్వీస్ 2 సంవత్సరాలు కాకుండా జీరో సర్వీస్ కు అవకాశం ఇవ్వాలి. అని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం ఆదిలాబాద్ జిల్లా శాఖ సోమవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి మెమోరాండం ఇచ్చారు.

మైదాన ప్రాంతాలలో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యలు వేరు, ఏజెన్సీ గిరిజన ప్రాంతాలలో పని చేసే ఉపాద్యాయుల సమస్యలు వేరు. ప్రభుత్వం అన్నీ రకాల ఉపాద్యాయులను ఒకే కోణంలో చూడవద్దు. మెమోరాండంలో వారు పేర్కొన్నారు. కనీస వసతులు లేని వారికి పట్టణాలలో ఉన్న వారికి ఒకే రకమైన ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదు. ఏజెన్సీ ప్రాంతంలో పని చేస్తున్న వారికి జీరో సర్వీస్ తో బదిలీలు చేపట్టాలని సంఘం పక్షాన డిమాండ్ చేశారు.


అదే విధంగా గురుకులాల.కన్న 40 సంవత్సరాల ముందు ప్రారంభం అయిన గిరిజన ఆశ్రమ పాఠశాలలకు, ప్రభుత్వం కొత్త పోస్టులు మంజూరు చెయ్యాలి. ఆశ్రమ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలి. విద్యకు సంబంధం లేని అధికారులతో కాకుండా విద్యకు సంబంధం ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి పర్యవేక్షణ చేయించాలి. అంటూ అందులో పేర్కొన్నారు. పర్యవేక్షణ అధికారుల పోస్టులు మంజూరు చేసి గిరిజన విద్యను బలోపేతం చేయాలి అని,గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి. పేద గిరిజన విద్యార్థులకు అన్ని రకాల విద్యా పరమైన వస్తువులు పలక, బలపం, పెన్నులు, నోట్ పుస్తకాలు, 4 జతల దుస్తువులు, బ్యాగ్ తదితర వస్తువులతో కూడుకున్న ప్రత్యేక కిట్స్ సరఫరా చేయాలి అంటూ అర్హులైన ఉపాద్యాయులకు ఖాళీగా ఉన్న పోస్టులలో పదోన్నతి ద్వారా భర్తీ చేయాలి. పేర్కొన్నారు.
అనంతరం సంఘ పక్షాన క్యాలెండర్ తో ఆవిష్కరింపజేశారు.

సంఘ జిల్లా శాఖ అధ్యక్షుడు పెండ్యాల విజయ శేఖర్, గౌరవ అధ్యక్షుడు మాడావి లక్ష్మణ్, అసోసియేటెడ్ అధ్యక్షుడు టెక్కం గోవిందరావు ప్రధాన కార్యదర్శి జాదవ్ శివాజీ, తదితరు ఉపాధ్యాయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.