మానసిక వేదనకు గురైన మహిళా భక్తులు!
ఇతర ప్రదేశాల్లో చెట్లకు పూజలు చేసుకున్న మహిళలు !
J. SURENDER KUMAR,
ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అనుబంధ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గల ‘ రావి చెట్టు’ పూజకు ఆలయ అధికారులు నిర్బంధంగా టికెట్ కొనుగోలు చేసి పూజలు చేసుకోవాలని మహిళా భక్తులకు సోమవారం హుకుం జారీ చేశారు. దీంతో మహిళా భక్తులు పవిత్రమైన పర్వదినం రోజున ముందస్తు ప్రకటన చేయకుండా. రావి చెట్టు పూజకు టికెట్టు ఎలా పెడతారు ? అంటూ అక్కడ అర్చకుని ప్రశ్నించడంతో. ఇవి ఈవో ఆదేశాలంటూ వివరించారు. దీంతో కొందరు మహిళా భక్తులు. టికెట్టు తీసుకుంటాం పూజాది కార్యక్రమాలు వ్రతకల్పం చెప్పాలి అంటూ నిలదీసినట్టు సమాచారం.? అమావాస్య వ్రతకల్పం మేము చెప్పము, మీరే చెప్పించుకోండి అంటూ ఖరాకండిగా చెప్పినట్టు సమాచారం. మానసిక వేదన చెందిన భక్తులు ధర్మపురి క్షేత్రంలోనీ హనుమాన్ వాడ, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గల రావి చెట్టుకు, ఇతర ప్రాంతాల్లో ఉన్న రావి చెట్టలకు పూజలు, వ్రతాలు చేసుకున్నారు. ఆలయ అధికారుల చర్యలను మహిళా భక్తులతో అసహ్యించుకుంటున్నారు.

వివరాలు ఇలా ఉన్నాయి.
పవిత్ర సోమవతి అమావాస్య పర్వదిన సందర్భంగా. శ్రీరామలింగేశ్వర స్వామి. ఆలయంలో వందలాది సంవత్సరాల రావి చెట్టుకు. పసుపు కుంకుమలతో పూజలు చేసి వ్రతకల్పం చెప్పించుకోవడం ఆనాదిగా కొనసాగుతున్న తంతు. సోమవారం సోమతి అమావాస్య వ్రతం కోసం భారీ సంఖ్యలో మహిళా భక్తులు పూజా సామాగ్రి తో స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయంలో గల రావి చెట్టు వద్దకు చేరుకున్నారు. పూజలు చేసుకునే మహిళలు ఒక్కొక్కరు ₹250/- టికెట్టు తీసుకోవాలని ఆలయ సిబ్బంది వారిని ఆదేశించారు. షాక్ కు గురి అయిన మహిళ భక్తులు, రావి చెట్టు పూజకు టికెట్ ఏమిటి ? అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. మాకు ఏమీ తెలవదు E.O ఆదేశాలు అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో కొందరు మహిళా భక్తులు మాకు పూజా విధానం, వ్రతకల్పం చెప్పే పూజారి ఉన్నారా ? అంటూ ప్రశ్నించారు ? దీంతో మాకు పూజా విధానం తెలియదు టిక్కెట్ తీసుకోవాలని వారు స్పష్టం చేశారు.

మానసిక వేదనకు గురైన మహిళలు మౌనంగా క్షేత్రంలోని ఇతర ప్రాంతాల్లో గల రావి చెట్ల వద్దకు పూజలు పూజలు చేసుకున్నారు. రానున్న రోజుల్లో ఏ దేవుడి దర్శనం కు ఎంత మొత్త టికెట్ ప్రతి వసూలు చేస్తారని భక్తజనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రావి చెట్టుకు గల విశిష్టత !

సనాతన ధర్మములో గాని ఆర్ష ధర్మములో గాని పురాణముల లో వృక్ష జాతికి యున్న ప్రాధాన్యత తక్కువగాదు. ఆధ్యాత్మిక ఆలంబనకు ఆనవాలముగా అనాదినుండి ప్రశంశింపబడేవి వృక్షములు. రావిచెట్టుకు గల ప్రాధాన్యత చాలా గొప్పది. ఈ చెట్టును పిప్పల వృక్షమని కూడా అంటారు. ఈ అశ్వత్థ వృక్షములు దేవతల నివాస స్థానములు అని అధర్వణ వేదములో చెప్పారు. ఆదిత్య వృక్షమని కూడా రావి చెట్టును సంబోధిస్తారు. అంబరీష మహాముని శాపమువలన శ్రీమహావిష్ణువు అశ్వత్థ వృక్షముగా రూపాంతరం చెందెనని పద్మపురాణం చెబుతోంది. అందుకే శ్రీమహావిష్ణువును అశ్వత్థ నారాయణుడిగా కీర్తించారు. వృక్షములలో అశ్వత్థ వృక్షమును నేనే అని భగవంతుడు గీతలో వివరించినట్లు పురాణ కథనం.

పవిత్ర సోమతి అమావాస్య!
సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ అమావాస్యను మౌని అమావాస్య, శని అమావాస్య అని కూడా పిలుస్తారు. సోమాతి అమావాస్య రోజున రావిచెట్టును 108 సార్లు
ప్రదక్షిణలు చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
అనేది పురాణ కథనం.

జగిత్యాల లో సోమతి అమావాస్య పూజలు!
జిల్లా కేంద్రంలో జగిత్యాల పట్టణంలోని వాణీనగర్ ధర్మశాల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో సోమావతి అమావాస్య సందర్భంగా మహిళల ప్రత్యేక పూజలు., సోమావతి వ్రతాలు జరుపుకున్నారు. ఆలయ నిర్వాహకులు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తరపున సౌకర్యాలను ఏర్పాటు చేశారు.