J. SURENDER KUMAR,
ధర్మపురి మున్సిపల్ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా శనివారం మంత్రి కొప్పుల విషయం ₹ 4కోట్ల 67లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మంత్రి తో పాటు పాల్గొన్నారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా బొలి చెరువు నుండి ధర్మపురి పట్టణానికి ఇంటి ఇంటికి మంచి నీటిని అందించే లక్ష్యంతో 1కోటి రూపాయలతో నిర్మించిన పైప్ లైన్ను ప్రారంభించారు.
25లక్షలతో గంగమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు
కొరండ్లపల్లెలో 1కోటి40లక్షలతో నిర్మించబోయే రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
.17లక్షలతో బాలికల జూనియర్ కళాశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
2కోట్లతో నిర్మించబోయే అంబేద్కర్ విజ్ఞాన భవనానికి శంకుస్ధాపన చేశారు.
10లక్షలతో సుతారి సంఘం భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో. స్థానిక మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ సంగి సత్తమ్మ, జడ్పిటిసి సభ్యురాలు బత్తిని అరుణ, ఎంపీపీ చిట్టి బాబు, DCMS చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న, AMC ఛైర్మెన్ అయ్యోరీ రాజేష్,
కౌన్సిలర్లు మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆధికారులు,తదితరులు పాల్గొన్నారు..
జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి!

జర్నలిస్టు శీలం రాజు (ఇండియ నౌ తెలుగు ఛానల్ రిపోర్టర్) అనారోగ్యంతో గత కొన్ని రోజుల క్రితం మృతిచెందగా మంత్రి కొప్పుల ఈశ్వర్ , జగిత్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత వారి సభ్యులను పరామర్శించి ఓదార్చారు.