ఈనాడు’ కుట్రపూరిత అసత్య ప్రచారం తేటతెల్లమైంది!

దేవులపల్లి అమర్
ఏపీ జాతీయ మీడియా సలహాదారు!

J.SURENDER KUMAR

సిహెచ్. రామోజీ రావు సారధ్యంలోని ఈనాడు మోసపూరిత, కుట్ర పూరిత అసత్య ప్రచారం మరోమారు తేటతెల్లమైంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు వత్తాసు పలికే క్రమంలో రామోజీరావు, ఆయన మీడియా నిస్సిగ్గుగా విశ్వసనీయతనే పణంగా పెట్టి అభూత కల్పనలకు పాల్పడి పరువు పోగొట్టుకున్న తాజా ఉదంతంతో అయినా కళ్లు తెరిచి తమ మీడియా ఉనికికే ఆయువు పట్టు అయిన క్రెడిబిలిటీ పోగొట్టుకునే పద్ధతులకు స్వస్తి చెప్పాలి. అని ప్రకటనలో పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభిరాం, ఆయన అనుచరులు గన్నవరంలో ప్రత్యర్థి వైఎస్ ఆర్ సిపి కార్యకర్తల పై దాడి చేసిన ఘటనలో పోలీసులు పట్టాభిరాం, ఇతర టిడిపి కార్యకర్తల ను అరెస్టు చేసిన వార్త ప్రచురణలో ఈనాడు తప్పుడు సమాచారాన్ని ప్రచురించి తన చంద్రబాబు అనుకూల నైజం చాటుకుంది. పేర్కొన్నారు.

సోషల్ మీడియా గుట్టు రట్టు చేసింది!

తాము ఏం రాసినా జనం నమ్మేస్తారనుకుని ఇంతకాలం జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఈనాడు వంకర రాతల గుట్టు సోషల్ మీడియా రట్టు చేసింది.
పోలీసులు తనపై ధర్డ్ డిగ్రి పద్దతులు ప్రయోగించి వేధింపుల కు గురి చేశారంటూ పట్టాభి మేజిస్ట్రేట్ కు చేసిన ఫిర్యాదును నమ్మబలికే విధంగా గాయాలతో ఉన్న పట్టాభి ఫొటోలను ఈనాడు పబ్లిష్ చేసింది. అయితే ఆ ఫొటోలు పాత ఫొటోలని 2021 నాటి అసలు ఫొటోలను సోషల్ మీడియా బయటపెట్టి ఈనాడు అసలు రంగును బయటపెట్టింది. గుట్టు రట్టు కావడంతో విధిలేని పరిస్థితులలో ఈనాడు వివరణ ఇవ్వవలసి వచ్చింది. పొరపాటున పాత ఫొటోలు పబ్లిష్ చేశామంటూ సాంకేతిక కారణాల వల్ల ఈ పొరపాటు జరిగిందని చేసిన ఘోర తప్పిదానికి పస లేని వాదన తెచ్చింది. పట్టాభిని పోలీసులు హింసించారంటూ 2021 నాటి ఫొటోలతో మిస్ లీడింగ్ వార్త మొదటి పేజీలో బ్యానర్ వార్త ప్రచురించి, అడ్డంగా దొరికిపోయిన తర్వాత

లోపలి పేజీలో ఆకటన ఇలా ఉంది

వివరణ మాత్రం లోపలి పేజీలో సింగిల్ కాలం వార్త గా అప్రధానంగా వేసింది అని పేర్కొన్నారు.
ఈనాడు తప్పుడు, కుట్రపూరిత వార్తలు వండి వార్చే విధానాలకు ఇప్పటికైనా స్వస్తి పిలికి మీడియా విశ్వసనీయత ను కాపాడు కోవాలి. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చే ఈ తరహా తప్పుడు ధోరణి వీడాలి. ఈ తరహా మీడియా సంస్థల క్రెడిబిలిటీని పాఠకులు ప్రశ్నిస్తున్నారన్న సత్యం గ్రహించాలి.
ఈనాడుతో పాటు చంద్రబాబు విధేయ ఇతర పత్రికలు, న్యూస్ ఛానల్స్ తమ వంకర, పక్షపాత, కుట్రపూరిత, మోసపూరిత ధోరణులకు స్వస్తి చెప్పాలి. దేవులపల్లి అమర్ ప్రకటనలో హితవు పలికారు.