హైకోర్టు లైజనింగ్ అధికారిగా ముహమ్మద్ వకీల్ !

ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్!

J. Surender Kumar,

తెలంగాణ రివెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ (TRESA) జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు ముహమ్మద్ వకీల్ జగిత్యాల జిల్లా ప్రభుత్వ శాఖలకు హైకోర్టు లైజనింగ్ అధికారిగా నియామకం ఉత్తర్వులు కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మీన్ బాషా జారీ చేశారు.

కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మీన్ బాషా గురువారం ఉత్తర్వులు జారీ చేస్తూ జగిత్యాల జిల్లా ప్రభుత్వ శాఖలకు, హైకోర్టు లైజనింగ్ ఆఫీసర్ గా రెవెన్యూ శాఖ లో జగిత్యాల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. నియామకం పట్ల ట్రేస్సా జగిత్యాల సభ్యులు మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయం,జగిత్యాల పరిపాలనా అధికారి నాగార్జున, TRESA రాష్ట్ర కార్యదర్శి కాళీ చరణ్, ఉర్దూ అధికారి జిల్లా జగిత్యాల ముహమ్మద్ కలీముద్దీన్, TNGOS జిల్లా జగిత్యాల అధ్యక్షుడు శశిధర్, ట్రేస్సా జగిత్యాల జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య , గిర్దావర్ ఉమేష్, రియాజ్, మహమూద్, అమేర్ సోహేల్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు