J. Surender Kumar,
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటి సారి తమ స్వగ్రామమైన ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి శనివారం విచ్చేసిన జస్టిస్ శ్రీమతి జువ్వాడి శ్రీ దేవిని ధర్మపురి కోర్టు సివిల్ జడ్జి శ్యాంప్రసాద్ ,. ధర్మపురి బార అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి పుష్ప గుచ్ఛం అందించారు.

పలువురు న్యాయవాదులు. న్యాయమూర్తితో ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెత్తపు లక్ష్మన్ , న్యాయవాదులు ఎర్ర నర్సయ్య, కొండపల్కల వెంకటేశ్వరరావు , గడ్డం లింగారెడ్డి, మామిడాల శ్రీకాంత్, రామడుగు రాజేష్, సాంబరాజుల కార్తిక్, జాజాల రమేష్ ,బత్తిని ఇంద్రకరణ్ , తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.