కొండగట్టు ఆలయంలో అధికారులదే ఇష్టారాజ్యం!

సీఎం కేసీఆర్ కే అసహనం కలిగించారు!


వారిపై చర్యలకు జంకుతున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు !


దొంగతనం సంఘటనలోచిరు ఉద్యోగులే బలి పశువులా ?

J. SURENDER KUMAR,

దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడానికి ఆ శాఖ ఉన్నతాధికారులు జంకుతున్నారనే, విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్, కొండగట్టు పర్యటనలో అధికారుల, అర్చకుల ప్రవర్తన తీరుపై ఆ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలోనే సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. పది రోజులు గడిచిన బాధ్యుల నుంచి అధికారులు వివరణ కోరలేని దుస్థితి ఉందనే చర్చ కొనసాగుతున్నది. శుక్రవారం తెల్లవారుజామున ఆలయంలో జరిగిన దొంగతనం సంఘటనలో చిరు ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ, బలి పశువు చేశారనే ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొందరు ఉద్యోగులకు మెమోలు జారీ చేయడంలో ఆంతర్యం ఏమిటో అంతుపట్టడం లేదని చర్చ.


వివరాల్లోకి వెళ్తే!

కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం సీఎం ₹100 కోట్ల నిధులు విడుదల చేశారు. స్వయంగా కొండగట్టు క్షేత్రంలోఈనెల 15 స్వామివారిని దర్శించుకుని కాలి నడకన పర్యటించారు. మరో యాదాద్రి తలపించే విధంగా 1000 కోట్లు నిధులైన కొండగట్టు క్షేత్ర అభివృద్ధి కోసం కేటాయిస్తాను అంటూ ప్రకటించారు.

ఈ సందర్భంలో సీఎం కెసిఆర్ ను ఆశీర్వదిస్తున్న, అర్చకులు, వేద పండితులు పోటాపోటీగా ఆశీర్వచన శ్లోకాలు, మంత్రాలు ఉచ్చరించినట్టు సమాచారం. లక్ష్మీ అమ్మవారి వద్ద, శ్రీ వేంకటేశ్వర స్వామి వద్ద, శ్రీ ఆంజనేయ స్వామి వద్ద, ఉచ్చరించాల్సిన మంత్రాలు, శ్లోకాల గూర్చి సీఎం, అర్చకులకు వివరించినట్టు చర్చ. ఇదిలా ఉండగా సీఎం పర్యటన ముందస్తు ఏర్పాట్లు నిమిత్తం ఒక రోజు ముందు C.M.O కార్యాలయ అధికారి కొండగట్టు ఆలయం కి రాగా ఇదే తరహాలో అధికారిని అర్చకులు ఆశీర్వదిస్తుండగా, దేవదాయ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి, హనుమాన్ సన్నిధిలో ఆ మంత్రాల ఎలా ? అంటూ హెచ్చరించినట్టు చర్చా.

దీనికి తోడు సిఎం కొండగట్టు పర్యటన సందర్భంగా పలు ఆలయాల నుంచి భారీ సంఖ్య లొ ఉధ్యుగులు రావడం తొ ఇంత మంది ఎందుకు వచ్చారు ? అంటూ ఓ అధికారిని సిఎం ప్రశించినట్టు సమాచారం. వెంటనే అధికారి డ్యూటీ చాట్ వివరాలను కోరినట్టు సమాచారం.

ఈవో అక్రమాలపై పాలకవర్గ చైర్మన్ ఫిర్యాదు, చర్యలు తీసుకోవడానికి జంకుతున్న ఉన్నతాధికారులు!

కొండగట్టు ఆలయ పాలకవర్గ చైర్మన్ గత సంవత్సరం నవంబర్ లో. ఆలయ కార్యనిర్వహణాధికారి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న తీరు, అవినీతి అక్రమాల పై. దేవదాయ శాఖ కమిషనర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చైర్మన్ ఫిర్యాదు మేరకు గత సంవత్సరం నవంబర్ 23న హైదరాబాద్ కార్యాలయం నుంచి ఎడిసి అధికారిని జ్యోతి మేడమ్, కరీంనగర్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, మరో అధికారి కొండగట్టులో విచారణ చేశారు. విచారణలో పలు అవినీతి, అక్రమాలు వెలుగు చూడడంతో విచారణ నివేదికను ఆ శాఖ ఉన్నతాధికారికి సమర్పించారు. నెలలు గడుస్తున్నా ఈఓపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు పాలకవర్గ సభ్యులు, ఉద్యోగులు పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంతో ఆలయ అభివృద్ధిని, భక్తుల వసతి సౌకర్యాల కల్పన విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

సస్పెండ్ తో సమస్య పక్కదారి ?

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన కొండగట్టు ఆలయ దొంగతనం సంఘటనలలో చిరు ఉద్యోగి వాచ్ మెన్ ను సస్పెండ్ చేయడం, కొందరు హోంగార్డులకు మెమో జారీ చేయడంలో ఆంతర్యం దొంగతనం సమస్య పక్కదారి పట్టించడమే విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఆలయంలో ఉద్యోగులు, అర్చకులు మూడు వర్గాలుగా ఏర్పడి ఆధిపత్యం కోసం అంతర్గతంగా గొడవలు పడుతున్నట్లు చర్చ.
సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని కొండగట్టు ఆలయ అధికారుల, అర్చకుల తీరు తెన్నూల పై విచారణ జరిపి కఠిన చర్యలు చేపట్టకపోతే ఆలయ ప్రాముఖ్యత, ప్రతిష్ట, పవిత్రత మసకబారే అవకాశాలు ఉందనే చర్చ భక్తులలో నెలకొంది.