మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్ బైస్ ప్రమాణ స్వీకారం!

J. Surender Kumar,

మహారాష్ట్ర  గవర్నర్‌గా భగత్ సింగ్ కోష్యారీ స్థానంలో రమేష్ బైస్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.  .  రాజ్‌భవన్‌లో బాంబే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎస్వీ గంగాపూర్వాలా బైస్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. బైస్ మరాఠీలో ప్రమాణం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. సెప్టెంబర్ 2019 నుండి మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన కోష్యారీ తన పదవీకాలంకు గత వారం రాజీనామా చేశారు. శుక్రవారం ముంబై రాజ్ భవన్ కు చేరుకున్న గవర్నర్ రమేష్ బైస్ దంపతులకు రాజ్ భవన్ సిబ్బంది యంత్రాంగం  సాంప్రదాయ పద్ధతులు స్వాగతం పలికారు