J.Surender Kumar,
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పాలన పారదర్శకంగా సాగుతుందని భావిస్తే అందుకు భిన్నంగా పోలీసుల అదుపులో పాలన సాగుతోంది అని ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో సోమవారంఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం లో మాట్లాడారు.
ఆయన మాటల్లో…
చట్టసభల్లో ప్రజా సమస్యల పై నిలదీస్తే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు..ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజల దగ్గరికి వెళ్దామంటే పోలీసుల అనుమతి నిరాకరిస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితేనే మనుగడ సాగే దుస్థితి నెలకొంది. మహబూబాబాద్ లో వైఎస్ఆర్టిపి అధినేత్రి షర్మిల హైకోర్టు నుండి అనుమతి పొందినా కూడా కేవలం స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడారనే నెపంతో అరెస్టు చేయడం దారుణం అన్నారు. పోలీసుల చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు.
నేర విచారణలో సాంకేతిక ఆధునిక విజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ మెదక్ లో ఖదీర్ ఖాన్ పై థర్డ్ డిగ్రీ ఉపయోగించడం మానవ హక్కుల ఉల్లంఘన నే అన్నారు. సుప్రీంకోర్టు ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల నిఘాలోననే విచారణ చేపట్టాలని తీర్పు చెప్పిన అమలుకు నోచుకోవడం లేదన్నారు.

ఖదీర్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకునేటప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని, అతని మృతి అనంతరం పోస్ట్మార్టం రిపోర్టులో కిడ్నీలు దెబ్బతిన్నాయని స్పష్టంగా తేలిందన్నారు.
పోలీసులు నేర విచారణ పేరుతో ఐదు రోజులుగా లాక్ అప్ లో ఉంచుకొని తప్పునీ కప్పిపుచ్చుకునేందుకు తహసిల్దార్ ఎదుట బైండ్ఓవర్ చేశారని ధ్వజమెత్తారు.
లాకప్ డెత్ కు కారణమైన పోలీసులను శాఖ పరమైన చర్యలు తీసుకోవడం పై డీజీపీని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభినందించారు.
కేవలం శాఖ పరమైన చర్యలే కాకుండా ఖదీర్ ఖాన్ మృతికి కారణమైన పోలీసులపై 302 ఐపిసి పార్ట్ 2 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారనడానికి సస్పెన్షన్ కూడా ఒక అదారమన్నారు. తక్షణమే పోలీసులపై కేసు నమోదు చేయాలనీ కాంగ్రెస్ తరపున డిమాండ్ చేస్తున్నామని, అన్నారు.
హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో చేపడితేనే విచారణ నిస్పాక్షపాతంగా కొనసాగుతుందన్నారు.బాధిత కుటుంబ సభ్యులకు రూపాయలు 50లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేసు నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలో ఒకే రకమైన కేసులో పోలీసులు రెండు విధాలుగా వ్యవహరిస్తున్న తీరును ఎమ్మెల్సీ తప్పుపట్టారు. ఖదీర్ ఖాన్ విషయంలో పోలీసులు ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ విచారణ పేరుతో ఐదు రోజులు లాకప్ లో నిర్బంధించారని,
జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్లో ముగ్గురు మృతి చెందడానికి కారణమైన వ్యక్తి పై ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు., సూసైడ్ నోట్లో పేరు ఉన్న, ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేసినా నిందితుడిని అదుపులోకి తీసుకోలేదన్నారు. సాక్షాలు సేకరిస్తున్నామంటూ పోలీసులు తాత్సారం చేస్తున్నారన్నారు.
కనీసం నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని విమర్శించారు.
నిందితుడిని పోలీసులు చుట్టంగా చూస్తున్నారని ఆరోపించారు. ముగ్గురు మృతి కారణమై న్యాయవాద వృత్తికే కళంకం తెచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టకపోవడం దారుణం అన్నారు. పోలీసులను ప్రశ్నించేవారు ఎవరూ లేరన్నట్టుగా ఇష్టరాజ్యం గా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ముగ్గురు మృతికి కారణమైన వ్యక్తి కేసులో సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేపడితే తప్ప నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందనే నమ్మకం లేదన్నారు.
ఖదీర్ ఖాన్ మృతి కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరిగేలా ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని అన్నారు. డీజీపీ తక్షణమే కేసు నమోదు చేయాలనీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
సమావేశంలో పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మన్సూర్, గుంటి జగదీశ్వర్, చల్లా రాధా కిషన్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ధర రమేష్ బాబు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కచ్చూ హరీష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా మధు, మహిపాల్ పాల్గొన్నారు.