J.Surender Kumar,
రాష్ట్ర ఎస్సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం నాడు అమెరికా వెళ్ళనున్నారు. అమెరికా లోని ఉతా (UTA) నార్త్ సాల్ట్ లేక్ సిటీలో ఫ్యామిలీ సెర్చ్ ఇంటర్నేషనల్ (FAMILY SEARCH INTER NATIONAL ) ఆధ్వర్యంలో జరగనున్న రూట్స్ టెక్- 2023 ఎక్స్ పో (ROOTS TECH EXPO-2023)లో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొననున్నారు.
రూట్స్ టెక్- 2023 ఎక్స్ పో మంత్రి పాల్గొంటారు.
ఇన్స్టిట్యూషనల్ రిలేషన్షిప్స్, ఫ్యామిలీ సెర్చ్ ఇంటర్నేషనల్ ఆసియా చీఫ్ రిప్రజెంటేటివ్ స్టీఫెన్ ఎల్. నికెల్ రూట్స్ టెక్-ఎక్స్ పో కు ఈనెల 13న ప్రతినిధి బృందం ఆహ్వానించడం పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతోషం వ్యక్తం చేశారు
అమెరికా పర్యటన లో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ ల్యాటర్ డిసెన్స్ సంస్థ (LDS)సంస్థ ప్రతినిధులను కలవనున్నారు.

తెలంగాణ రాష్ట్ర పర్యటన కు వచ్చిన LDS ప్రతినిధుల బృందం జగిత్యాల జిల్లా ధర్మపురి,
పెద్దపల్లి జిల్లా ధర్మారం పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రలను పరిశీలించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర పథకాలపై ప్రశంసలు కురిపించారు. గ్రామాల్లో విద్యా వైద్య రంగాలకు తమవంతు సహకరిస్తామని అప్పట్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హామీ ఇచ్చారు. వారి హామీ మేరకు అమెరికాలో ల్యాటర్ డిసెన్స్ సంస్థ ప్రతినిధులు డైరెక్ట్ ఆవ్, స్టివ్ లతో భేటీ కానున్నారు. విధేశి బృందం ప్రతి నిధులతో సంప్రదింపులు జరిపి తెలంగాణ రాష్ట్రనికి ప్రయోజనం చేకూర్చే అంశాలపై మాట్లాడానున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ సందర్బంగా చెప్పారు.