సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ లో సెలెక్ట్ అయిన విద్యార్థులు!

J. Surender Kumar,

జగిత్యాల పట్టణంలో మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కి చెందిన విద్యార్థులు మ్యాకల సుహాస్ 261/300, రాగిల్ల విశ్వతేజ  256/300 ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష గత నెల జరిగిన పరీక్ష ఫలితాలలో రాష్ట్రస్థాయిలోనే అత్యధిక మార్కులు సాధించి  జిల్లాలోనే ప్రభంజనం సృష్టించారు.

ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ బి. రజితరావు, డైరెక్టర్లు బి శ్రీధర్ రావు, బి హరిచరణ్ రావు, జె. మౌనిక రావు ఉపాధ్యాయ బృందం వారిని అభినందించారు.

ఏసీబీకి చిక్కిన హెచ్ఎం!.


ఖమ్మం జిల్లా  మధిర ప్రభుత్వ హైస్కూల్ హెచ్ఎం  ఎం శ్రీలత, శనివారం ఏసీబీ అధికారులకు  రెడ్ హ్యాండ్ గా పట్టుబడింది.
మన ఊరు – మన బడిలో భాగంగా భవన నిర్మాణ కాంట్రాక్టు బిల్లులకు సంబంధించిన చెక్కులపై సంతకం పెట్టేందుకు గాను, ఆమె ₹ 50,000 డిమాండ్ చేయగా, అందులో ₹25 వేల రూపాయలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ  డీఎస్పీ సత్యనారాయణ తన బృందంతో దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకున్నారు.