వస్త్రాలను సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
!
J.Surender Kumar
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శనివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు .
అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో హరిద్ర నాథ్ పట్టు వస్త్రాలు సమర్పించారు

ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా,జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ , ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు,ఈవో కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు