కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కి జైలు శిక్ష!

30 రోజుల్లో లోగో అప్పీలు చేసుకునే అవకాశం !
పరువు నష్టం దావా కేసులో.

J.SURENDER KUMAR,

మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చింది. రెండేళ్లు జైలు శిక్ష విధించింది. సూరత్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి హెచ్ హెచ్ వర్మ గురువారం ఈమేరకు తీర్పునిచ్చారు. 30 రోజులు లోపు హైకోర్టుకు వెళ్లడానికి అవకాశం ఇస్తూ రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేశారు.


2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కర్ణాటక కోలార్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు రాహుల్. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. దేశంలో దొంగల ఇంటి పేరు మోదీ అనే ఎందుకు ఉంది? అని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.
రాహుల్ వ్యాఖ్యలపై అప్పుడే తీవ్ర దుమారం చెలరేగింది. తమ కమ్యూనిటీని అవమానించేలా రాహుల్ మాట్లాడారని గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్‌ మోదీ రాహుల్‌పై కోర్టులో పరువునష్టం దావా వేశారు. విచారణ అనంతరం రాహుల్‌ను దోషిగా తేల్చింది న్యాయస్థానం. అయితే ఈ తీర్పును రాహుల్‌ హైకోర్టులో సవాల్ చేసే అవకాశముంది.