ఫ్లాష్.. ఆడిటర్. బుచ్చి బాబుకు బెయిల్ ! 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో..

J.Surender Kumar

ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ అరెస్టు చేసిన హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు గోరంట్లకు రోస్ అవెన్యూ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది.

బుచ్చిబాబు గోరంట్ల  ఎమ్మెల్సీ కె కవిత మాజీ ఆడిటర్, ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ సోమవారం బుచ్చిబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ పాస్‌పోర్టును సరెండర్ చేయాలని కోరారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా ఇదే కోర్టు మార్చి 20 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది.
నిందితులు సాక్ష్యాలను తారుమారు చేయరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని బెయిల్ మంజూరు చేసే సమయంలో కోర్టు షరతు విధించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బుచ్చిబాబును సీబీఐ ఫిబ్రవరి 8న అరెస్టు చేసింది.