హోలీ పండుగ మన సాంస్కృతిని తెలియజేస్తాయి !

జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతం !

J. SURENDER KUMAR,

హోలీ పండుగ మన సాంస్కృతిని చాటి చెప్తాయన్నారు, చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసులో వారు ఎంతో సంతోషంగా హోలీ జరుపుకోవడం ఆనాదిగా వస్తున్నదని జగిత్యాల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు.
మంగళవారం దావ వసంత సురేష్, LM చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహలత, జగిత్యాల ఎమ్మెల్యే సతీమణి రాధిక సంజయ్ కుమార్ , ఐసీడీఎస్, ఆశవార్కర్లు, అంగనివాడి టీచర్లు, మహిళా సంఘం సభ్యులతో హోలీ వేడుకలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహిళా నాయకులు మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు, మన సాంస్కృతి సాంప్రదాయాలను పండగలు చాటి చెబుతాయని పేర్కొన్నారు, భారతదేశంలో మనం జరుపుకునే పండుగలు ఎంతో గొప్పవి ప్రతి పండుగకు ఒక ప్రత్యేక విశిష్టత ఉందన్నారు,

హోలీ వేడుకలను ప్రతి సంవత్సరం దేశం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకుంటారని తెలిపారు,ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ ఆచార సంప్రదాయాల గురించి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు,తెలంగాణ రాష్ట్ర మరియు,జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు

బుగ్గారంలో…


బుగ్గారం మండలంలో జరిగిన ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న LM కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహలత, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాదినేనీ రాజేందర్, ఎంపీపీ బాదినేని రాజమణి, సర్పంచ్ సుమలత, వైస్ ఎంపీపీ సుచేందర్, వెల్గొండ&యశ్వంత్ రావుపేట్ ఎంపీటీసీలు లక్ష్మి, జిల్లా జాగృతి అధ్యక్షురాలు జమున, మండల మహిళా అధ్యక్షురాలు సుజాత,

ఆడిషనల్ DRDO సుధీర్, ఎంపిడిఓ తిరుపతి, IKP APM మోహన్ దాస్, ICDS CDPO కుసుమ, ICDS సూపర్ వైజర్ విజయలక్ష్మి, మరియు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు