మా రైతులను మేమే వంద శాతం కాపాడుకుంటాం – సీఎం కేసీఆర్ !

కరీంనగర్ జిల్లా పర్యటనలో..

J.SURENDER KUMAR,

ఇప్పుడు దేశంలో ఒక డ్రామ నడుస్తొందన్నారు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా ఉందని… వాళ్ళకు రాజకీయాలు తప్ప… ప్రజలు… రైతులు అవసరం లేదన్నారు. అందుకే తాము పంట నష్టం పై కేంద్రానికి నివేదిక పంపాలనుకోవడం లేదని…
మా రైతుల ను మేమే వంద శాతం కాపాడుకుంటాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సిఎం కెసిఆర్ రైతులు ధైర్యంగా ఉండాలని… నష్టపోయిన ప్రతి ఎకరానికి 10 వేల చొప్పున చెల్లిస్తామని హామి ఇచ్చారు. గురువారం సిఎం కెసిఆర్ కరీంనగర్ లో జిల్లాలోని వర్షప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఉదయం నుండి ఖమ్మం, వరంగల్, మహబూబాద్ జిల్లాల్లో పర్యటించిన సిఎం కెసిఆర్… మధ్యాహ్నం 4 గంటల వేళ హెలికాప్టర్ ద్వారా… రామడుగు మండలం లక్ష్మీపూర్ చేరుకున్నారు. సిఎం కెసిఆర్ కు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్… ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్… ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి, దాసరి తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అకాల వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన సిఎం కెసిఆర్… రైతులతో మాట్లాడి… నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నష్టపరిహారం ఉత్తర్వులు జారీ


రైతులతో పాటు… కౌలు రైతులను సైతం ఆదుకుంటామని హామి ఇచ్చారు. వాస్తవానికి రైతులకు ఇచ్చే దాన్ని నష్టపరిహారం అనరని… దానిని సహాయ పునరావాస చర్యలు అని అంటారని చెప్పారు. పంట నష్టం పై తాము కేంద్రానికి నివేదిక పంపేది లేదని స్పష్టం చేశారు. దేశంలో ఇన్స్యూరెన్స్ కంపనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్ప… రైతులకు అండగా నిలిచే బీమాలు… కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవన్నారు. భారతదేశంలో కొత్తగా వ్యవసాయ పాలసీ రావాలని సీఎం కేసీఆర్ అన్నారు.