వైభవంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం!

👉 పాల్గొన్న  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు !

J SURENDER KUMAR,

ధర్మపురి జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ సాయంత్రం వేళ అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కల్యాణ మహోత్సవంను  రాష్ట్ర  ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు మరియు ట్రాన్స్ జెండర్ సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్  బి. సత్యప్రసాద్  దంపతులతో కలిసి పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

ధర్మపురి క్షేత్రం తెలంగాణలో అత్యంత ప్రాచీన మరియు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమని అన్నారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం భక్తి, సంప్రదాయాల సమ్మేళనంగా అత్యంత వైభవంగా నిర్వహించబడిందని తెలిపారు. వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారి దివ్య కళ్యాణం నిర్వహించటం ఆనందదాయకమని పేర్కొన్నారు.

జిల్లా ప్రజలు సుఖశాంతులతో, ఐశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో జిల్లా శుభిక్షంగా ఉండాలని ఆ స్వామి కృప వల్లే మంత్రిగా జిల్లాకు సేవ చేయడం అదృష్టం గా భావిస్తున్నట్లు తెలిపారు.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం దేవస్థానం వైభవానికి నిదర్శనమని అన్నారు. ఆలయ అధికారులు, సంబంధిత అధికారులు ఉత్సవాల సమగ్ర ఏర్పాట్లు ఘనంగా చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ధర్మపురి పట్టణాభివృద్ధికి మరియు జిల్లా అభివృద్ధికి ఎన్నో నిధులు కేటాయించారని అలాగే రానున్న రోజుల్లో మరిన్ని నిధులు జిల్లాకు తీసుకువచ్చే విధంగా జిల్లా మంత్రిగా భాద్యత తీసుకుంటానని తెలిపారు.

ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సాంప్రదాయ విలువలను పెంపొందిస్తాయని  తెలిపారు.

వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.

భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాది భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి మరియు జిల్లా కలెక్టర్ దంపతులు స్వామివారికి ప్రత్యేకంగా పూజలు సమర్పించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.

కార్యక్రమ నిర్వహణలో ఆలయ అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించారు. పోలీసు శాఖ తరఫున భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించారు. శ్రద్ధాభక్తులతో పాల్గొన్న భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

సంప్రదాయబద్ధంగా జరిగిన కళ్యాణ మహోత్సవం అందరినీ ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక పరవశంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయిల అధికారులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.