10న జగిత్యాలలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాదయాత్ర!

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!

J. Surender Kumar,

ఈనెల 10న జగిత్యాలలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివరించారు. సోమవారం జిల్లా కేంద్రంలో ని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

జగిత్యాల రూరల్ మండలం చల్గల్ నుండి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాథ్ సే హథ్ జోడో అభియాన్ యాత్ర ప్రారంభం కానున్నదని తెలిపారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు ప్రజల కు ఇచ్చిన హామీల ను విస్మరించి ప్రజలను అప్పుల ఉబిలోకి దించారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ హథ్ సే హథ్ అభియాన్ యాత్ర చేపట్టినట్టు ఆయన వివరించారు. పాదయాత్రలో భాగంగా బీర్పూర్ మండలం రోళ్ల వాగు ప్రాజెక్ట్ ని రేవంత్ రెడ్డి పరిశీలించమన్నారని, జగిత్యాల నియోజకవర్గం లో ఒక రోజు మత్రమే రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.

మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రాస్తారోకో !

జగిత్యాలలో మరోసారి మాస్టర్‌ ప్లాన్‌ రద్దు కోరుతూ రైతుల ఆందోళన. బాట పట్టారు. సోమవారం జగిత్యాల తిమ్మ పూర్ – నల్లగుట్ట వద్ద మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేయాలని అన్నదాతల ఆందోళన. చేశారు. మున్సిపల్‌ తీర్మానం రద్దు చేసి ప్రభుత్వానికి పంపినా.. జీవో విడుదల చేయకపోవటం .జీవో విడుదల చేయాలని రైతుల డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.