ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్!
J.SURENDER KUMAR,
కాంగ్రెస్ పార్టీని చీల్చే అవసరం ఎవరికి లేదని వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ముక్కలైందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.
సోమవారం సాయంత్రం ప్రెస్ క్లబ్ లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా మారిందన్నారు. ప్రతిపక్షాలు కేవలం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేస్తున్నారని సంజయ్ అన్నారు.
ఇటీవలి కాలంలో జగిత్యాలలో కవితను టార్గెట్గా చేసుకొని విమర్శలు చేస్తున్నారని అలాగే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ చీల్చుతోందనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉందా అన్న అనుమానాన్ని సంజయ్ కుమార్ వ్యక్తం చేశారు. ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ ముక్కలైందని కాంగ్రెస్ బీఆర్ ఎస్ పార్టీ ఖతం చేస్తోందని సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి అనడంతోనే ఆ పార్టీ ఏ స్తాయిలోకి దిగజారిపోయిందో అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో నిర్మల్ నుంచి మంచిర్యాల కు వచ్చేసరికి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి బీజేపీలో చేరడంతోనే కాంగ్రెస్ పార్టీ ఏందో తెలిసిపోతుందన్నారు. అంటే మహేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో చేర్పించిందా? అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రశ్నించారు. నూట ఇరవై ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఒక ప్రాంతీయపార్టీ ఖతం చేస్తుందని ప్రచారం చేయడం మానుకోవాలని హితవుపలికారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చిలిపోయిందని ఎవరు చీల్చాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దాదాపు ఖాతమైందని అక్కడక్కడ కొందరు పెద్దమనుషుల మూలంగా కాంగ్రెస్ కనిపిస్తోందని నాయకత్వ లోపంతోనే టిడిపి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకొని అధ్యక్ష పదవి అప్పగించారని ఎమ్మెల్యే అన్నారు. ఈమధ్యకాలంలో కాంగ్రెసుపార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి కవితమ్మపై అనవసరపు ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ బిజెపి కుమ్మక్కైదని ఆరోపణలు చేస్తున్నాడన్నారు. కేంద్రంలోని బిజెపి పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని, మంత్రులను టార్గెటుగా చేసుకొని వేధింపులకు గురిచేస్తోందన్నారు. కవితక్కను జైలుకు పంపాలని బిజెపి చూసినా కవితక్క కు వ్యతిరేకంగా ఆధారాలు లేక పోవడంతోనే అరెస్ట్ చేయలేకపోయారని ఎమ్మెల్యే చెప్పారు. పదే పదే ఒక అబద్ధాలు ప్రచారం చేసి జనంలో దాన్ని నిజం చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని జనాలకు అబద్ధాల పార్టీ కాంగ్రెస్ అని తెలిసిపోయిందన్నారు. ఈ రోజు కేంద్ర హోంమంత్రి మైనార్టీల రిజర్వేషన్లపై మాట్లాడితే జీవన్ రెడ్డి ఆ విషయం పై మాట్లాడినట్లు తెలిసిందని ఎమ్మెల్యే చెప్పారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఉంటే తెచ్చిన 5 శాతం రిజర్వేషన్లను కాపడలేదని అన్నారు. బీఆర్ ఎస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని 12 శాతం రిజర్వేషన్ల కై కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెప్పారు. బీఆర్ఎస్ పై ఆరోపణలు చేయడం మానుకోవాలని మొదట మీ పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకొని పని పెట్టుకోవాలని జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ హితవు పలికారు. నిజానికి ముధోల్, నిజామాబాద్, మెదక్ లాంటి ప్రాంతాల్లో మీ పార్టీకి ఆభ్యర్థు లున్నారో చూసుకోవాలి ఎమ్మెల్యే అన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతోనే బిజెపి పార్టీ పుంజుకుంటోందనే విషయాన్ని గుర్తుచేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. బీజేపీతో ఫైట్ చేయడానికే కేసీఆర్ దిగాడని వెనుకాడేది లేదని బీజేపీతో ఎప్పటికి పొత్తు పెట్టుకోమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ లు ముస్కు నారాయణ రెడ్డి, పంభాల రామ్ కుమార్, జిల్లా రైతు బందు సమితి సభ్యులు కోలుముల రమణ, సర్పంచుల ఫోరం బీర్ పూర్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, సర్పంచ్ ఢిల్లీ రామారావు, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, అడువాల లక్ష్మన్, డిష్ జగన్,యూత్ అధ్యక్షులు కత్రోజ్ గిరి,యూత్ ప్రధాన కార్యదర్శి శరత్ రావు,పాల్గొన్నారు.