ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సమాచారం భద్రపరచడంలో నిర్లక్ష్యంపై!
కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
హైకోర్టు ఆదేశాలతో ఆదివారం చేపట్టిన ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ వ్యవహారం కి సంబందించి స్ట్రాంగ్ రూం తాళాలు లేకపోవడం, కౌంటింగ్ సమయంలో రికార్డ్ చేసిన విడియో ఫుటేజ్, మరియు సిసి టివి ఫుటేజ్ లేకపోవడం, స్ట్రాంగ్ రూం లోపల ట్రంకు పెట్టెలు సరైన క్రమంలో లేకపోవడం, వాటిలో కొన్ని బాక్సులకు మాత్రమే తాళాలు వేసి ఉండటం, తదితర అంశాలపై ఫిర్యాదుదారుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అడ్డూరి లక్ష్మణ్ కుమార్, సోమవారం భారత ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, నిరంజన్ తో కలిసి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ద్వారా భారత ఎన్నికల కమిషన్ ముఖ్య అధికారికి ఫిర్యాదు పత్రాన్ని. పంపించారు.
ఫిర్యాదులో

17సి కి సంబంధించిన పత్రాలకు సీల్ లేదని, కౌంటింగ్ విషయం లో జరిగిన అవకతవకల పైన తప్పిదాల పైన విచారణ జరిపించి బాధ్యుల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు..అదే విధంగా కౌంటింగ్, విషయంలో జరిగిన అవకతవకలపై త్వరలోనే డిల్లీ లోని కేంద్ర ఎన్నికల అధికారిని స్వయంగా కలిసి పిర్యాదు చేయడానికి లక్షణ్ కుమార్ అపాయింట్మెంట్ కోరుతూ లేఖను సైతం పంపించారు.
