మురళీధర్ రావుకు అభినందనల పరంపరంలు!
నాగపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో వందలాది మందికి వసతి సౌకర్యాలు!
J.SURENDER KUMAR,
హైదరాబాద్ నుంచి శనివారం ఉదయం వందలాది వాహనాల కాన్వాయ్ తో ప్రారంభమైన భారత్ దర్శన్ యాత్ర కు నాగపూర్ లో కేంద్రమంత్రి నితిన్ గడ్గరి ఘనంగా స్వాగతించారు .

రాత్రి వందలాది మందికి శాసనసభ్యులు గృహాలను కేటాయించారు. ఆదివారం భారత్ రాత్రులకు మహారాష్ట్ర ప్రభుత్వం 25 ఏసీ బస్సులను సమకూర్చి పట్టణంలో ప్రముఖ యాత్ర స్థలాలను సందర్శింపజేశారు. ప్రధానంగా దీక్ష భూమిని సందర్శించారు.

నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఆరంభమైన సమయం సందర్భం డాక్టర్ హెడ్డే వారి వివరాలను, చరిత్ర అంశాలను ఆర్ఎస్ఎస్ కార్యాలయ నిర్వాహకులు వివరించారు. సాయంత్రం బేతాలి ప్రాంతంలో నీ తాప్సి నది కి మురళీధర్ రావు ,వీర గోపాల్ ఆధ్వర్యంలో హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యాత్రకు భారీ సంఖ్యలో పోలీసు భద్రత కల్పించారు.

హిందూ సంస్థలు ,ఆయా ప్రాంతాల ప్రజలు యాత్రకు ఘన స్వాగతం పలుకుతూ స్వాగతం స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, నినాదంతో ఇతర రాష్ట్రాలలో ఏడు రోజులపాటు ఈ యాత్ర తెలుగు సంగమం కమిటీ ఆధ్వర్యంలో యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే.