నూతన సచివాలయానికి శాఖల తరలింపు – నేటి నుంచి 28 వరకు !

ప్రారంభోత్సవానికి ముందు సుదర్శన యాగం.?

J.SURENDER KUMAR,

సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్ర నూతన సచివాలయం లోకి బుధవారం నుంచి వివిధ శాఖలు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ తరలింపు  ప్రక్రియ ఈనెల 28 వరకు కొనసాగనున్నట్టు సమాచారం.  ఈనెల 30న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నూతన ‘ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయ’ ఆవరణలో సుదర్శన యాగం నిర్వహించనున్నట్టు చర్చ.

సచివాలయంలో ఒక్కో ఫ్లోర్‌ను మూడుశాఖలకు కేటాయించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రెవెన్యూశాఖ, మొదటి ఫ్లోర్‌లో హోంశాఖ, రెండో అంతస్తులో ఆర్థికశాఖ, మూడో ఫ్లోర్‌లో వ్యవసాయం, ఎస్సీ డెవలప్‌మెంట్‌ శాఖలకు కేటాయించారు.  నాలుగో అంతస్తులో నీటిపారుదలశాఖ, న్యాయశాఖలకు, ఐదో అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ, ఆరో ఫ్లోర్‌లో సీఎం, సీఎస్‌లకు కేటాయించారు. లోవర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో స్టోర్స్‌, రికార్డ్‌ రూమ్‌లు, వివిధ సేవలకు సంబంధించిన ఆఫీసులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

.