జగిత్యాల జడ్పీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం!
J.SURENDER KUMAR,
భారత దేశంలోని మహిళల అభ్యున్నతి కొరకు మరియు మహిళా సాధికారత సాధించుటకు గాను దేశవ్యాప్తంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా పార్లమెంట్ లో మహిళా బిల్ ను ప్రవేశపెట్టాలని జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

బుధవారం జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జరిగింది. ముఖ్య అతిథులుగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ,అడిషనల్ కలెక్టర్ మంద మకరంద్, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా రైతుబంధు అద్యక్షులు చీటీ వెంకట్ రావు జిల్లా పరిషత్ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మార్చి10వ తేది, 2023 రోజున పెద్ద ఎత్తున దేశ రాజధాని డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎం.ఎల్.సి. కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో 29 రాష్ట్రాల మహిళలతో నిరాహారదీక్ష చేపట్టినందున మహిళల అభ్యున్నతి పట్ల వారు చేస్తున్న కృషి మరియు అంకిత భావానికి జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ పక్షాన కవిత కు మద్దతుగా మహిళల ప్రజా ప్రతి నిధులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించాలని ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు జిల్లా అధికారులు సమాధానాలు తెలియజేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ జగిత్యాల జిల్లాను ప్రగతి పథంలో ఉంచాలని అన్నారు.

డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను భావి తరాలకు స్ఫూర్తి కలగాలనే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సాధకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంకల్పంతో 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నందు హుస్సేన్ సాగర్ తీరంలో విగ్రహావిష్కరణ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రికి సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు కొప్పుల ఈశ్వర్ కు జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ పక్షాన కృతజ్ఞతలు తెలుపుచూ జిల్లా పరిషత్ తరుపున కొప్పుల ఈశ్వర్ ను ఘనంగా సన్మానించి, జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశము నందు తీర్మానం ప్రవేశపెట్టరు.
తెలంగాణా అంబేడ్కర్ సీఎం కెసిఆర్ అని జెడ్పీ ఛైర్పర్సన్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ గారికి అంబేద్కర్ మీద గౌరవము చిత్త శుద్ది ఉంటే నూతన పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.