పాత పెన్షన్ పునరుద్ధరణ చెయ్యాలి!

TSCPSEU రాష్ట్ర ఉపాధ్యక్షుడుపవన్ కుమార్!

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా కేంద్రం లో TSCPSEU రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆదివారం పెన్షన్ రాజ్యాంగ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా CPS ఉద్యోగ ఉపాధ్యాయులు మార్చ్ నిర్వహించి అంబెడ్కర్ విగ్రహం కు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మ్యాన పవన్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబెడ్కర్ దూరదృష్టితో రచించిన భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 309 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ లు రాష్ట్ర పరిధి లొనే ఉండాలి డిమాండ్ చేశారు. దీన్ని కాలరాస్తు ఉద్యోగి సామాజిక భద్రత పి.ఎఫ్.ఆర్.డి.ఆ చట్టం ద్వారా షేర్ మార్కెట్ పాలు అవుతోంది. సీపీయస్ విధానం ఆర్టికల్ 14 కు విరుద్ధం ఒకే స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన సామాజిక భద్రత లేక పోవడం బాధాకరమన్నారు. నాటి ప్రభుత్వలు తెచ్చిన PFRDA చట్టం ను రద్దు చేసేలా మరియు సామాజిక భద్రత ను మరియు పెన్షన్ లేకుండా చేస్తున్న కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి, రాష్ట్ర ప్రభుత్వం మాకు పాత పెన్షన్ అమలు జరిపేల ప్రభుత్వల యొక్క మనస్సు మార్చి మా యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని కోరుతూ అంబెడ్కర్ వినతిపత్రం ఇచ్చారు. పాత పెన్షన్ ను ప్రభుత్వలు పునరుద్ధరణ చేసి మా న్యాయమైన కోరిక ను నెరవేర్చాలని డిమాండ్ చేసారు. జిల్లా అధ్యక్షులు గంగాధరి మహేష్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అయిదు రాష్ట్రలలో పాతపెన్షన్ పునరుద్ధరణ జరిగింది అన్నారు. దేశంలో ఆరవ రాష్ట్రం గా గౌరవ ముఖ్యమంత్రి అదృష్ట సంఖ్య అయిన ఆరవ రాష్ట్రం గా తెలంగాణ కావాలని CPS రద్దు చేసిన అయిదు రాష్టాలకు కేంద్రం నుండి రాష్ట్రలకు రావాల్సిన డబ్బులను తీసుకొని రావడం లో ముఖ్యమంత్రి పెద్దన్న పాత్ర పోషించి మిగిలిన రాష్ట్రలకు తెలంగాణ ఆదర్శంగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సర్వ సతీష్, కోశాధికారి గొల్లపెల్లి మహేష్ గౌడ్, భోగ శ్రీనివాస్, జీ గణేష్ , అల్లే రాజేందర్, అరికె రవి కుమార్, బొల్లం ఆంజనేయులు, గాదె వెంకటేష్, బండారి సతీశ్ వివిధ ఉపాధ్యాయ సంఘలా జిల్లా నాయకులు,TGO,TNGO& రెవెన్యూ సంఘాల నాయకులు ఉద్యోగ ఉపాద్యాయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పాల్గొన్నారు.