ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ ఆలయం తెరిచారు!

J.SURENDER KUMAR,

దేశంలో ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాలు నెలకొన్న కేదార్ నాథ్ ఆలయం భక్తుల దర్శనాల కోసం మంగళవారం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల ఘోషల మధ్య లో తెరిచారు. దాదాపు 30 క్వింటాళ్ల వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు.
కాగా, చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 22న అక్షయ తృతీయ రోజున ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు  యాత్రికుల కోసం తెరుచుకున్నాయి. బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 27న తెరవనున్నారు. 2023, నవంబర్ 14 న ఛార్ ధామ్ యాత్రను ప్రభుత్వం నిలిపివేస్తుంది.

రుద్రప్రయోగం నుంచి కేదార్నాథ్ ఆలయానికి స్వామి వస్తున్న దృశ్యం!

చార్ధామ్ యాత్ర కోసం ఇప్పటివరకు మన దేశంతో పాటు విదేశాల నుంచి 16 లక్షల మందికి పైగా భక్తులు నమోదు చేసుకున్నారు.

ఏప్రిల్ 30 వరకు రిజిస్ట్రేషన్ బంద్!

ఎగువ గర్హ్వాల్ హిమాలయ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలో గర్హ్వాల్ డివిజన్ అదనపు కమిషనర్ (పరిపాలన), చార్ధామ్ యాత్ర అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ అదనపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ కవిరియాల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతికూల వాతావరణం, భారీ హిమపాతం దృష్ట్యా ఏప్రిల్ 30 వరకు రిషికేశ్, హరిద్వార్లో కేదార్నాథ్ యాత్ర కోసం యాత్రికుల నమోదును తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు.
కేదార్ నాథ్ మూర్తి పల్లకిని ఉఖిమత్ (రుద్ర ప్రయాగలో )  వద్ద ఉన్న శీతాకాలపు నివాసం నుండి కేదార్‌నాథ్‌కు, మంత్రోచ్ఛారణలు  ఆర్మీ బ్యాండ్, సంగీత వాద్యాల మధ్య , ఆలయ ప్రధాన పూజారి రావల్ భీమా శంకర్ లింగ్, ఆలయతలుపులు తెరిచారు.


దర్శనం కోసం వచ్చిన యాత్రికులపై పూల  వర్షం కురిపించడానికి ఒక ఛాపర్‌ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి  పుష్కర్ సింగ్ ధామి,  ప్రతికూల వాతావరణ నేపథ్యంలో ప్రారంభ వేడుకలకు హాజరు కాలేకపోయారు. వాతావరణం అనుకూలంగా మారడంతో సీఎం మందిరానికి చేరుకొని కేదార్నాథ్ దర్శించుకున్నారు., “యాత్రకు యాత్రికులందరినీ మేము స్వాగతిస్తున్నాము. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, ఉత్తమమైన వాటిని అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాత్రికులకు సాధ్యమయ్యే సౌకర్యాలు.” కల్పనకు కృషి చేస్తున్నామని, సీఎం అన్నారు.. దాదాపు పదివేల మంది భక్తులు మంగళవారం కేదార్నాథ్ స్వామిని దర్శించుకున్నారు.