సమీకృత మార్కెట్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్!

₹ 4.5 కోట్ల నిధులతోఎకరాలలో నిర్మాణం పనులు!

J. Surender Kumar,

జగిత్యాల పట్టణంలోనీ వ్యవసాయ మార్కెట్ (బిట్ బజార్ లో 2 ఎకరాలలో) ₹ 4.5 కోట్ల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న  సమీకృత వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను అధికారులు,నాయకులతో కలిసి బుధవారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరిశీలించారు.
ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ..

ప్రజల సౌకర్యార్థం కోసమే సమీకృత మార్కెట్..
పెరుగుతున్న జానాభా అవసరాల కోసం 2 ఎకరాలలో మార్కెట్ నిర్మాణం. చేపట్టామన్నారు
చల్గల్ మార్కెట్ అభివృద్ధికి ₹ 8 కోట్ల నిదులు కేటాయింపు.. జరిగిందని వాలంతరీ క్షేత్రం నుండి 10 ఎకరాల స్థలం చల్ గల్ మార్కెట్ కు కేటాయించమన్నారు.


లక్ష చదరపు అడుగులతో షేడ్స్ నిర్మాణం..
జగిత్యాల పట్టణంలో ప్రజల సౌకర్యార్థం పాత బస్ స్టాండ్ రైతు బజార్, టవర్ మార్కెట్,  అంగడి బజార్ మార్కెట్, బీట్ బజార్ మార్కెట్ ల అభివృద్ది. రైతు బజార్ లో హోల్ సేల్ మార్కెట్ కు డిమాండ్…ఇతర జిల్లా ల నుండి వ్యాపారుల తాకిడి..బీఫ్ మార్కెట్ కోసం అదనంగా వేరే స్థలం కేటాయింపు చేయటం జరిగింది. అని వివరించారు.
అసత్య ప్రచారాలు నమ్మవద్దు..
జగిత్యాల అభివృద్ది ధ్యేయంగా పని చేస్తున్నాము ప్రజలు గమనించాలని కోరారు..
ఈ కార్యక్రమంలో కమిషనర్ డా.నరేష్, స్థానిక కౌన్సిలర్ సమిండ్ల వాణి శ్రీనివాస్,DE రాజేశ్వర్, షకిల్, చిక్కుల భూమయ్య, జుంబార్తీ శంకర్, ఖలేమ్, మల్లేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.