ఎన్నికల కమిషన్ ముందు  హాజర్ అవుతారా ?  గైరాజరవుతారా ?

విచారణ స్థలం మారింది !.. విచారణ అంశం మారింది.!


నేడు జేన్టీయూలో  కళాశాలలోఎన్నికల కమిషన్ విచారణ !


ధర్మపురి ఎన్నికల ఫలితాల అంశంలో..

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా నాచుపల్లి  జేఎన్టీయూ కళాశాలలో సోమవారం జరగనున్న ఎన్నికల కమిషన్ విచారణకు 2018లో నిర్వహించిన ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికార యంత్రాంగం, నాటి జిల్లా ఎన్నికల యంత్రాంగం, కమిషన్ ముందు హాజరవుతారా ?  గైర్హాజరవుతారా ?  అనే అంశంలో ఉత్కంఠ నెలకొంది.  ఎన్నికల ఫలితాల వివరాలు, ఈవీఎంలు భద్రపరిచిన వి ఆర్ కె ఇంజనీరింగ్, కళాశాలలో కాకుండా ఎన్నికల. కమిషన్ అధికారి, జేఎన్టీయూ కళాశాలలో విచారణకు నోటీసులు జారీ చేయడం, చేపట్టనున్న విచారణ  అంశం లో  స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్సింగ్ పై జిల్లా ఎన్నికల అధికారుల నుంచి వివరణ కోరతారా?  విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలకు సిఫారసు చేస్తారా? హైకోర్టు సమర్పిస్తారా ?  సోమవారం విచారణ ముగిసే వరకు తెలిసే అవకాశం లేదు.  ధర్మపురి ఎన్నికల రిటర్నింగ్ అధికారి బిక్షపతిని కోర్టు ముందు హాజరు పరిచావలసిందిగా డిసిపి హైకోర్టు ఆదేశించడం, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 10న వి ఆర్ కె ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవడానికి వచ్చిన యంత్రాంగంకు తాళం చెవులు పనిచేయకపోవడం, జరిగిన ఉదాంతంపై జగిత్యాల జిల్లా కలెక్టర్ ఈనెల 11న హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో. తాళాల మిస్సింగ్ అంశంలో అంతర్గత విచారణ జరుపుతున్నామని పేర్కొనడం విశేషం. కలెక్టర్ చేపట్టిన అంతర్గత విచారణ నివేదికను ఎలక్షన్ కమిషన్ అందజేస్తారా ?  న్యాయస్థానానికి సమర్పిస్తారా ?  అనే విషయం తెలియాల్సి ఉంది.
వివరాలు ఇలా ఉన్నాయి

ధర్మపురి ఎస్సీ రిజర్వుడ్ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, ఆ ఎన్నికల్లో తాను ఓడిపోయినట్టు, ప్రస్తుతం మంత్రివర్గంలో కొనసాగుతున్న కొప్పుల ఈశ్వర్ గెలిచినట్టు అధికారులు ప్రకటించారని, ఆరోపణలు చేస్తూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్   సుదీర్ఘకాలంగా విచారణ జరుగుతున్నది. ఈ కేసులో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి సంబంధిత పత్రాలను తమకు సమర్పించాలని హైకోర్టు జస్టిస్  జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి కి కేసుకు సంబంధించి సంబంధిత పత్రాలు,  సిసి ఫుటేజ్ తమకు సమర్పించాలని హైకోర్టు జిల్లా యంత్రాంగంను , ఎన్నికల అధికారిని ఆదేశించినా, వారు స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయని సమాధానం ఇచ్చారు.
ఈ సమాధానంతో సంతృప్తి చెందని హైకోర్టు  రిటర్నింగ్ అధికారి బిక్షపతికి వారెంట్ జారీ చేసింది.


ఈనెల 4న హైకోర్టు జస్టిస్ కే లక్ష్మణ్, కేంద్ర , రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారులకు నాటి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సమాచారాన్ని ఈనెల 11న హైకోర్టు సమర్పించాలని ఆదేశించారు.
స్ట్రాంగ్ రూం తాళాలు మిస్ అవ్వడంతో తెరవకపోవడం పై హై కోర్టు ఆదేశానుసారం అడ్లూరి లక్ష్మణ్ కుమార్  12-04-2023 న హై కోర్టుకు హాజరై 10 ఏప్రిల్ నాడు   వి.అర్.కే కళాశాలలోని స్ట్రాంగ్ రూం వద్ద జరిగిన సంఘటన పూర్వపరాలు లిఖితపూర్వకంగా  కోర్టుకు సమర్పించారు.

సోమవారం విచారణ హాజరు కావాల్సిందిగా ఎన్నికల అధికారి జారీ చేసిన నోటీస్!


తాళాలు మయమవ్వడం  పై హై కోర్టు ఆగ్రహించి, స్ట్రాంగ్ రూం తాళాలు మాయం ఉదంతం పై  పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ను, హై కోర్టు ఆదేశించింది..
ఈ నేపథ్యంలో 17.04.2023 సోమవారం రోజున JNTU    యూనివర్సిటీ కాలేజ్ (నాచుపల్లి, కొడిమ్యాల మండలం ) లో ఉదయం 11 గంటలకు సంబంధిత పత్రాలతో విచారణకు హాజరు కావాలని అప్పటి జిల్లా ఎన్నికల అధికారి, డిప్యూటీ ఎన్నికల అధికారికి ఎలక్షన్ కమీషన్ ఉత్తర్వులను జారీ చేసింది.