ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందా ?

2024 జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో!


కెసిఆర్ రాజకీయ ఎత్తుగడలో చిక్కేది ఎవరు ?

J.SURENDER KUMAR

2024 ఆంధ్ర ప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, చిలుతయా ? చీలకుండా ఉంటాయా ? చర్చ నెలకొంది. చర్చకు కారణం, ఆదివారం గుంటూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవమే ఓట్ల చీలిక అంశం లో చర్చలకు అవకాశం ఏర్పడింది . బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలో చిక్కేది ఏ రాజకీయ పార్టీ కానున్నదో ? కొన్ని నెలలో స్పష్టత రానున్నది.


విశ్లేషిస్తే…
2024లో ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఏట్టి పరిస్థితులలోనైనా సరే వైసిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తులు ఉంటాయి, అంటూ ప్రముఖ సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సభలు, సమావేశాలు, మీడియా సమావేశాలలో కార్యకర్తల శిక్షణ శిబిరాలలో ఆవేశంతో బల్లగుద్ది పదేపదే చెప్పడం జగమెరిగిన సత్యం. పవన్ కళ్యాణ్ తో పాటు. ఆ పార్టీలో నెంబర్ 2 గా కొనసాగుతున్న ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సైతం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా, ప్రతిపక్ష పార్టీల, రాజకీయ పోత్తులు ఉంటాయని, అనేక సందర్భాల్లో వివరించిన విషయం తెలిసిందే.


జనసేన మా మిత్రపక్షమే – బిజెపి పార్టీ!


మాది, జనసేన పార్టీది మిత్రపక్షమే మేము కలిసే ఉన్నాము, రానున్న ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాం, అంటూ అనేక సందర్భాల్లో ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు, ఆ పార్టీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, పలు సందర్భాల్లో మీడియా సమావేశంలో ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.


తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ పొత్తుల కోసం తహతహ – వైసిపి ఆరోపణలు!


కొన్ని సందర్భాలలో దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ ఒకరి వద్దకు మరొకరు వెళ్లి కలిసి చర్చించుకోవడం , ఇద్దరు కలిసి మీడియా సమావేశంలో మాట్లాడడం, తదితర సంఘటనలు నేపథ్యంలో జనసేన పార్టీని, చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టాడంటూ, పవన్ కళ్యాణ్, బాబు దత్త పుత్రుడు అంటూ, కాపుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టాడు అంటూ, తదితర ఆరోపణలను వైసిపి పార్టీ, నాయకులు అనేక సందర్భాల్లో జనసేన పార్టీ తో పాటు, పవన్ కళ్యాణ్ పై మీడియా సమావేశాల్లో సీరియల్ గా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.


ఓట్లు, సీట్లు లేకుండా నే సీఎం పదవి ఎలా అడుగుతాం – జనసేన అధినేత !


ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఏ రాజకీయ పార్టీతోనైనా (రానున్న ఎన్నికల్లో) పొత్తులు ఉంటాయి, జనసేన పార్టీకి గెలుపోటములు ప్రభావితం చేసే ఓట్లు గాని, అసెంబ్లీలో ప్రశ్నించే స్థాయి ఎమ్మెల్యే సీట్లు లేని జనసేన పార్టీ ఆయా పార్టీల పొత్తుల సందర్భంలో సీఎం సీటు కోసం ఎలా ? డిమాండ్ చేస్తాం, అంటూ అర్థం వచ్చేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. మన గౌరవానికి భంగం కలగకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఎన్నికల సందర్భంలో పొత్తులు ఉంటాయంటూ పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు.
ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే చర్చ ఏపీ రాజకీయ పార్టీల లో జరుగు తున్న విషయం తెలిసిందే. ఆ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ పార్టీకి వారి మద్దతు ఉంటుందనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటున్నాడనేది వైసీపీ నాయకుల రాజకీయ ఆరోపణలు.


బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మొదట ఏపీ అధ్యక్షుడీ నియామకం !


సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత మొదట ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడి గా బలమైన కాపు సామాజిక వర్గం కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ను కేసిఆర్ నియమించారు. ఇదే సందర్భంలో ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్, ఐఆర్ఎస్ మాజీ అధికారి చింతల పార్థసారథి, ఇతర నాయకులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో తోట చంద్రశేఖర్ వైయస్సార్సీపి పక్షాన ఏలూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓటమి పొందారు, పిదప ఆయన జనసేన పార్టీలో చేరి బీఆర్ఎస్ ఆవిర్భావంలో కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
ప్రస్తుతం ఏపీలో బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కు ఏపీలో, ఆ సామాజిక వర్గంలోను మంచిపట్టుంది. దీనికి తోడు ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్, పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలు అక్కడి కార్మిక లోకానికి, విశాఖ వాసులకు కొంతమేర కెసిఆర్ పై సానుకూలత ఏర్పడిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పక్షాన సింగరేణి సంస్థ బిడ్డింగ్ లో పాల్గొనడానికి తెలంగాణ సీఎం ఓ అధికారులను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి పంపించడం, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ, డిమాండ్, ఆదానికి కట్టబెట్టిన గనుల వివరాలను గణాంకాలతో సహా మంత్రి కేటీఆర్ ప్రత్యేక మీడియా సమావేశంలో వెల్లడించడం. తదితర ఏపీ సానుకూల చర్యల నేపథ్యంలో ఆదివారం గుంటూరులో బీ ఆర్ఎస్ పార్టీ ఆఫీసును అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరితే, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఒంటరిగా పోటీలో ఉంటాడా ? బీఆర్ఎస్ , జనసేన పార్టీలు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటాయా ? కలుస్తాయా ? అనేది వేయి డాలర్ల ప్రశ్న. ఒకవేళ పొత్తు కుదరకపోతే. పవన్ కళ్యాణ్, తోట చంద్రశేఖర్ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఎవరి పక్షాన పడే అవకాశం ఉందో లేదో వేచి చూడాల్సిందే. రాష్ట్రం విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ, ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణం టిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ కారణం అని ఏపీ ప్రజలలో తీవ్రస్థాయిలో వీరిద్దరిపై ఆగ్రహ వేషాలు కోపతాపాలు, నర నరాలలో ఉందనే విషయం జగమెరిగిన సత్యం.

దీనికి తోడు

సిపిఐ, సిపిఎం వామపక్షాలు, ప్రజాశాంతి పార్టీ , భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే కూటమిగా కలసి పోటీ చేస్తారా ? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఏలాంటి రాజకీయ కార్యాచరణ ప్రణాళిక కు. శ్రీకారం చుడతారో ? వేచి చూడాల్సిందే.

వారాహి రిజిస్ట్రేషన్ తెలంగాణలోనే!

ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీఎం కేసీఆర్ ప్రభుత్వ పనితీరు పట్ల, తెలంగాణ యువత, ప్రజల ను అనేక సందర్భాల్లో పొగడ్తలతో ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం విధితమే. పవన్ కళ్యాణ్ ఎన్నికల రథం, ‘ వారాహి’ వాహన రిజిస్ట్రేషన్ కు ఏపీ ప్రభుత్వం నిబంధనల పేరుతో ఇబ్బందుల గురి చేస్తే, పవన్ కళ్యాణ్ ‘వారాహికి’ తెలంగాణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా రిజిస్ట్రేషన్ అయిన విషయం తెలిసిందే. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో జనవరి మాసంలో ఆ వాహనంకు ప్రత్యేక పూజలు మొదట నిర్వహించారు. అనంతరం విజయవాడ దుర్గ ఆలయంలో వాహనం కు పూజలు చేశారు. నాలుగు నెలలైనా ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రథం ‘వారాహి ‘ తిరగకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఏపీకి చెందిన ఉమ్మడి రాష్ట్ర చివరి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల బిజెపి లో చేరిన విషయం తెలిసిందే.

గ్లాస్ గుర్తు

దీనికి తోడు భారత ఎన్నికల కమిషన్ ఓట్ల సీట్లు శాతం లెక్కించి జనసేన పార్టీ ఎన్నికల గుర్తు “గ్లాస్” ను తొలగించి ఫ్రీ సింబల్ గుర్తులలో చేర్చడంతో జనసేన పార్టీ అభ్యర్థులు ఏ గుర్తు పై పోటీ చేస్తారో ? అనే చర్చ ఉంది. ( భారత్ ఎన్నికల కమిషన్ తో జనసేన పార్టీ న్యాయ పోరాటం చేసి తిరిగి ‘గ్లాస్ ‘ గుర్తును పొందవచ్చు) సీఎం కేసీఆర్ తో స్నేహ సంబంధాలు ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కోరితే పవన్ కళ్యాణ్ ఆమోదిస్తారో ? తిరస్కరిస్తారో ? వేచి చూడాల్సిందే. దీనికి తోడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో. ఏపీ కాంగ్రెస్ శ్రేణులలో ఉత్సాహం ఉరకలు వేస్తున్నట్టు చర్చ
కెసిఆర్ రాజకీయ ఎత్తుగడలో ఏపీలో బీఆర్ఎస్, జనసేన, తెలుగుదేశం పార్టీలు కూటమిగా ఏర్పడితే సీఎం పదవి బాబుకు, డిప్యూటీ సీఎం పదవి బీఆర్ఎస్ ? లేదా జనసేన పార్టీ కి ? కట్టబెట్టే ఒప్పందంలో రాజకీయ సమాలోచనలు జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఎన్నికల ప్రకటన జారీ వరకు వేచి చూడాల్సిందే.