పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
ధర్మపురి లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన ‘లీడర్ షిప్ డెవలప్మెంట్ మిషన్ ‘ కార్యక్రమానికి జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘ లీడర్ షిప్ డేవలప్మెంట్ మిషన్ ఫర్ రిజర్వుడ్ కాన్సిస్టేన్సి’ ఇంఛార్జి తండబోయిన శ్రీకాంత్ పాల్గొని పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ…
నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని, అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, రైతులు ప్రస్తుతం పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులను తాలు తప్ప పేరిట ఎటువంటి ఇబ్బందులకు గురి చెయ్యకుండా హమాలీ ఖర్చు కూడా ప్రభుత్వమే భరించి ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే క్వింటాలుకు ₹ 25 వందల రూపాయల మద్దతు ధర కల్పిస్తామని, ప్రభుత్వ పథకాలు నిరుపేద వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఉండాలని, కానీ ప్రస్తుతం ఆర్థికంగా ఉన్న వారికి మాత్రమే పథకాల ఫలాలు చేకూరే విధంగా ఉన్నాయని, ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ₹ 5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని అన్నారు

ధర్మపురి లోని గాదేపల్లి లో గిరిజనులకు దక్కవలసిన భూములను గిరిజనేతరులు ఆక్రమిస్తే తెలంగాణ వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు గిరిజనులకు చెందవలసిన భూమిని వారికి అందేల చూడలేదని, మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే కొప్పుల ఈశ్వర్ ఏం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే దళితుల పట్ల, వారి హక్కుల పట్ల ఎటువంటి అన్యాయం జరిగిన వారి పక్షాన ముందుండి పోరాటం చేస్తామని, దళితబందు కేవలం అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప ఆర్థికంగా వెనుకబడిన దళితులకు దక్కడం లేదని, ధర్మపురి నియోజకవర్గం లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎంత మంది బి.సి లకు స్వయం ఉపాధి కల్పించారో శ్వేత పత్రాన్ని విడుదల చెయ్యాలని, జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మాట్లాడితే సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులు పంచడం తప్ప ధర్మపురి ని అభివృద్ధి చేసింది ఏం లేదని, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ‘ బాలిక సంరక్షణ పథకం’ పేరిట చట్టాన్ని రూపొందించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే తెల్ల రేషన్ కార్డులు జారిని నిరంతరంగా కొనసాగిస్తామని, ఇల్లు కట్టుకోవడానికి ఒకే దఫా లో ₹ 5 లక్షల రూపాయలు అందిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు వెంకటేష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రమేష్, బ్లాక్ కాంగ్రెస్ 1 అద్యక్షులు కుంట సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ 2 అద్యక్షులు రవీందర్ రెడ్డి, ధర్మపురి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘన భట్ల దినేష్, బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్, గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, ధర్మపురి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బిసి సెల్, అధ్యక్షులు మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రజాప్రతినిదులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..