J.SURENDER KUMAR,
స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా జగిత్యాల ఫోర్ట్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అదనపు కలెక్టర్ మకరందం అన్నారు.

ఆదివారం ఉదయం స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, డీపీవో దేవరాజ్ , అడిషనల్ DRDO నరేష్, కౌన్సిలర్లు, మున్సిపల్ DE నవ్య గ కళ్యాణి , శానిటేషన్ సిబ్బంది, మెప్మా మహిళలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది, NSS, లోకల్ యూత్, మహిళలు, ప్రజలు, పెద్ద ఎత్తున 150 మంది కి పైగా స్వచ్చందంగా శ్రమదానం చేసి పిచ్చి మొక్కలు, ఎండిపోయిన మొక్కల తొలగించడం, ప్లాస్టిక్, కవర్లు, బాటిల్ లు మొదలైన పొడి చెత్తను ట్రాక్టర్ లు, డోజర్ లు, జేసీబీ లు, గ్రాస్ కటింగ్ పనిముట్లు, పారలు, మొదలైవి ఉపయోగించి శుభ్రపరచరు. జిల్లా అదనపు కలెక్టర్ మందా మకరంద్ మాట్లాడుతూ

స్టార్ ఆకారం లో ఉన్న కోట తెలంగాణ లో మన జగిత్యాల కోట మాత్రమే అని దీనిని పరిరక్షణ చేయాల్సిన బాధ్యత మన అందరిదీ , అందరు ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థ లు, NSS, యూత్ ఆర్గనైజషన్ లు, ప్రజల సహకారం తో ఈ రోజు ఏ విధంగా అయితే శ్రమదానం చేసి కోట ని పరిశుభ్రం గా, అందం గా తయారు చేసామో అదేవిదంగా ఇంకా అభివృద్ధి చేస్తామని ఇటువంటి కార్యక్రమం లు తరచూ గా చేసి తెలంగాణ లో ప్రముఖ రాష్ట్ర పర్యటక ప్రాంతం గా తయారు చేస్తామని తెలియజేసారు… ఈ శ్రమదానం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియ జేశారు