దేశానికే పాఠాలు నేర్పిస్తున్న రాష్ట్రం తెలంగాణ!
మంత్రి కొప్పుల ఈశ్వర్!
J.SURENDER KUMAR,
పెగడపల్లి మండల కేంద్రంలో ఆదివారం పద్మనాయక ఫంక్షన్ హాల్ లో జరిగిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేత హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి, ఈశ్వర్ మాట్లాడుతూ…
కార్యకర్తలే బీఆర్‌ఎస్ పార్టీకి కొండంత అండ అని, కలిసికట్టు గా బీఆర్‌ఎస్‌ను కాపాడుకోవాలి అని, బిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసి ప్రతీ కార్యకర్తను మరింత చైతన్య పరిచేందుకు ఆత్మీయ సమ్మేళనాల సభలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు.
ప్రతి BRS పార్టీ కార్యకర్త మన మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యం లో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలని ప్రజలకి వివరించాలని, మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ కు మద్దతు ఇవ్వాలని, BRS పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చిన ఒక సోదరునిల అండగా ఉంటానని మంత్రి కొప్పుల అన్నారు.

దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు ఒక్క బీఆర్‌ఎస్ పార్టీకి మాత్రమే ఉందని మంత్రి అన్నారు.
తెలంగాణ రాష్ట్రం బిఆర్ఎస్ పార్టీ 8 సంవత్సరాల ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలనలో అద్భుతాలు జరుగుతాయని, కేసీఆర్ సారథ్యం లో దేశం లో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు మన రాష్ట్రం లో అమలవుతున్నయని, సంక్షేమ పథకాలు అమలులో భాగంగా ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, వృద్దులకు దివ్యాంగులకు, ఆసరా పింఛన్లు అందిస్తున్నామని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారాక్ పథకాల ద్వారా గౌరవంగా అడా బిడ్డల పెండ్లి కి సహాయం అందిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు
మరోసారి అధికారం మనదే – కార్యకర్తలు కార్యదీక్షులయి ఇంటింటికి తిరిగి ప్రజలకి అభివృద్ధి – సంక్షేమ పథకాలని వివరించాలని మండల నాయకులకు మంత్రి సూచించారు.
గత 40 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతులకు 3 గంటలు మాత్రమే కరెంట్ అందించిందని, కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నారని, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ₹ 200 రూపాయల పెన్షన్ మాత్రమే ఇచ్చింది, కాని కేసిఆర్ ఎవరు అడగకముందే ₹ 200 పెన్షన్ ను ₹ 2000 వేలు చేసారని, ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని మంత్రి అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదు, కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా, రైతులకు నీటిని అందించలేదు కాని, నీటి తీరువా పన్ను వసూలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా, ప్రజలు గమనించాలి, జనాల్లో ప్రశ్నించే తత్వం రావాలి, గ్రామ గ్రామాల్లో ప్రజలు చైతన్యవంతులు కావాలని మంత్రి కోరారు,