మహారాష్ట్ర అండర్ 19 క్రికెట్ టీమ్ కు
ధర్మపురి కుర్రవాడు ఎంపిక!

J.SURENDER KUMAR.

మహారాష్ట్ర అండర్ 19 క్రికెట్ లీగ్ మ్యాచ్ 2023 కి ధర్మపురి కి చెందిన విశ్వనాథ్ మహేష్ పాలెపు (19) ను నేషనల్ క్రికెట్ లీగ్ కమిటీ ( NCL) ఎంపిక చేసింది.
ముంబైలోని భారతీయ విద్య భవన్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విశ్వనాథ్, తల్లిదండ్రులు మహేష్ , మానసలు ముంబైలో పౌరోహిత్యం, ఆలయ అర్చకుడుగా కొనసాగుతున్నారు.

విశ్వనాథ్ ముంబై చర్చ్ గేట్ లోని ‘ సునీల్ క్రికెట్ అకాడమీ లో ‘ శిక్షణ పొందుతున్నరు. క్రికెట్ లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన జాతీయ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు ఆడిన క్రీడాకారులు స్టేడియంలో ప్రతిభా ఆధారంగా, పారదర్శకంగా, ప్రేక్షకుల సమక్షంలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

.

ఎంపిక విధి,విధానాలను ఎంపిక ప్రక్రియను నేషనల్ క్రికెట్ లీగ్ కమిటీ వీడియో రికార్డింగ్ చేసి భద్రపరుస్తుంది. విశ్వనాథ్ బ్యాటింగ్ లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేశారు. విశ్వనాథ్ ఎంపిక పట్ల ధర్మపురి వాసులు, క్రికెటర్ అభిమానులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.