పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి..
J.SURENDER KUMAR,
పల్లె దవాఖానతోని గ్రామాల ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులో ఉంటాయని, మారుమూల అటవీ ప్రాంతాలకు చెందిన ప్రజానీకానికి ఎంతో ఉపయోగపడుతుందని పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
మంగళవారం ఆయన బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామంలో మాట్లాడుతూ
బీర్పూర్ ఎంపీపీ మసర్తి రమేష్, జెడ్పిటిసి సభ్యురాలు పద్మరమేష్, సుభాష్, నవీన్ రావు, లక్ష్మన్, జితేందర్ తో పాటు స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు బీర్పూర్ మండలం కొల్వా యి గ్రామంలోని భవన మరమ్మత్తుల కోసం పట్టభద్రుల ఎమ్మెల్సీ నిధుల నుండి రు.5లక్షలు మంజూరు చేసినట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి తెలిపారు.
పల్లె దవాఖానాలో త్వరలో వైద్యుడిని సైతం నియమించి, గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువకు చేయనున్నట్లు తెలిపారు.
త్వరితగతిన పనులు పూర్తి చేసి, స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా స్థానిక నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు. సింగిల్ విండో చేర్మెన్ నవీన్ రావు గారు. తుంగూర్ సర్పంచ్ శ్రీమతి జితేందర్ యాదవ్ , బీర్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు. సుభాష్ . మల్లారెడ్డి . జోగిరెడ్డి . సారంగపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు. రామచంద్ర రెడ్డి . రాజిరెడ్డి . యూత్ నాయకులు గుండ మధు . లైశెట్టి విజయ్ . తదితరులు ఉన్నారు.