ప్రతిపక్షాలు రైస్ మిల్లుల ముందు ధర్నా చేయాలి!

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్!

J.SURENDER KUMAR,

రైస్ మిల్లులు ఇబ్బంది పెడితే ప్రతి పక్షాలు మిల్లుల ఎదుట ధర్నా చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద కాదని,రైతుల ను రెచ్చగొట్టడం సరికాదని, రైతులు శుద్ది చేసి,వ్యవసాయ అధికారి సర్టిఫై చేసిన ధాన్యాన్ని  రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే  వారిపై చర్యలు తప్పవు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.

ఆదివారం వ్యవసాయ మార్కెట్ చల్ గల్ లో పాక్స్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  పరిశీలించి, రైతులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ..
నియోజకవర్గంలో మొట్ట మొదట చల్ గల్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. 10 రోజుల్లోగా వరి ధాన్యం కొనుగోలు పూర్తి…రాష్ట్రంలో 3 రెట్లు వరి పంట సాగు విస్తీర్ణం పెరిగింది… అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంట్,మిషన్ కాకతీయ,కాళేశ్వరం ప్రాజెక్ట్,చెక్ డ్యాం లు,రైతు బంధు కార్యక్రమల తో పంట సాగు పెరిగింది.
గతం లో కరెంట్ మోటార్ లు,ట్రాన్స్ ఫార్మర్ లు కాలితే గతంలో దిక్కు లేదని నేడు ఆ పరిస్తితి లేదు అని అన్నారు. రైతు బందు ద్వారా చల్ గల్ గ్రామానికి 8 కోట్లు మంజూరు చేశామని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 199 కరెంట్ పోల్స్,21 ట్రాన్స్ ఫార్మర్ లు వేశామని,


744 కరెంట్ మోటార్ లకు ఉచిత విద్యుత్ ద్వారా 14 కోట్ల నిదులు కేటాయించడం జరిగింది అని అన్నారు.
ధాన్యాన్ని తూర్పార బట్టి ఇస్తే ఒక్కకిలోకట్ కాకుండా చూస్తాం అని సమస్య ఉంటే దృష్టికి తేవాలని అన్నారు.
34 రోజుల నుండి ఎలాంటి ఇబ్బందీ లేకుండా కొనుగోలు కేంద్రలు నడుస్తున్నాయి అని,అకాల వర్షాలు వల్ల కొంత ఇబ్బడి కలిగినది అని అన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మితే తెలంగాణ లో పిడి యాక్ట్ అమలు చేస్తున్నాం అని అన్నారు..
రైతుల ముసుగులో రాజకీయాలు చేసే నాయకుల పట్ల అప్రమత్తం గా ఉండాలని కోరారు.
రైతు పక్షపాతి ప్రభుత్వం బి అర్ ఎస్ అని రైతుల కోసం అనేక.సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని అన్నారు.
ఎమ్మెల్యే వెంట  AMC ఛైర్మెన్ నక్కల రాధ రవీందర్ రెడ్డి, PACS ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, AMC డైరెక్టర్ ఆనంద్ రావు,ఎంపీటీసీ దమ్మా మల్లారెడ్డి, ఉప సర్పంచ్ పద్మ తిరుపతి, పట్టణ పార్టీ
ప్రధానకార్యదర్షి అల్లాల ఆనంద్ రావు, చల్గల్ గ్రామ శాక పుదరి శ్రీనివాస్, మహిపాల్,
గంగారాం, తదితరులు పాల్గొన్నారు.