J.SURENDER KUMAR,
వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం కొనుగోలు జాప్యం, తరుగు ,తాలు పేరుతో జరుగుతున్న దోపిడీని నిరసిస్తూ పిలుపునిచ్చిన సోమవారం బంద్ కి జగిత్యాల జిల్లా, వ్యాప్తంగా వ్యాపారులు, వాణిజ్య సముదాయాలు, చిరువ్యాపారులు స్వచ్ఛంద గా మద్దతు తెలిపి, వాణిజ్య సముదాయాలు మూసివేయడం జరిగింది. జిల్లా నలుమూలల నుండి రైతన్నలు పెద్ద ఎత్తున తరలివచ్చి జగిత్యాల ప్రధాన రహదారులపై బైక్ లతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.
బంద్ కి మద్దతు తెలిపిన బిజెపి పార్టీ తరుపున నియోజకవర్గ నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి , హాజరై మాట్లాడుతూ,
ఇప్పటికే చీడపీడల తో గతంలో కన్న తక్కువ దిగుబడి వచ్చింది, ఆపై వడగళ్ల వానతో చాలా మంది రైతుల పంట పొలాల్లో రాలి పోవడం, అకాల వర్షాలతో ధాన్యం కొనుగొలు కేంద్రాల్లో పలుమార్లు తడిచిముద్దయి, రంగు మారిన పరిస్థితి, ఇలాంటి పరిస్థితిలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మిల్లర్లు అందినకాడికి 42, 43 కిలోల తూకం తో రైతుల రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారు, ఇప్పటికైనా ప్రభుత్వం,అధికార యంత్రాంగం దృష్టి పెట్టి కొనుగోలు వెంటనే యుద్ధప్రా తిపాదికన పూర్తి చెయ్యాలని పేర్కొన్నారు.ఇట్టి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతాంగానికి,సహకరించిన వ్యాపార,వాణిజ్య సంస్థలకు,చిరు వ్యాపారులకు,మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికీ జగిత్యాల రైతాంగం తరుపున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు నాయకులు బందేళ మల్లన్న, వేముల కర్ణాకర్ రెడ్డి, కోట్టల మోహన్ రెడ్డి, క్యతం సాయిరెడ్డి, మ్యాకళ మల్లేష్, సోమేష్ , కంచర్ల అఖిల్, బిజెపి పట్టణ అధ్యక్షులు వీరబట్టిని అనిల్, మండల అధ్యక్షులు నలువల తిరుపతి, కిసాన్ మోర్చ్ పట్టణ అధ్యక్షులు రాము, రూరల్ అధ్యక్షులు నర్సింహ రెడ్డి , ప్రధాన కార్యదర్శి మెరుగు ఉమేష్ , పెగడపెళ్ళి మండల అధ్యక్షులు గంగుల కొమురెల్లి, ఆనంటుల మహేష్ , తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి, కొల నారాయణ తదితరులు పాల్గొన్నారు.