విద్యుత్ శాఖలో విచిత్ర విధానం …
J.SURENDER KUMAR,
ప్రభుత్వ శాఖలలో నైనా ఉన్నతాధికారులు, మౌఖిక, లిఖిత ఆదేశాలు జారీ చేసిన సందర్భాల్లో తూ. చ తప్పకుండా సకాలంలో అమలు చేస్తున్న తమ కింది విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, అధికారులకు, ఉన్నతాధికారులు నిబంధనల మేరకు పదోన్నతులు కల్పిస్తూ, వారి పనితీరును ప్రశంసలతో అభినందించడం తెలిసిన విషయమే.
అయితే దీనికి విరుద్ధంగా జగిత్యాల జిల్లా విద్యుత్ శాఖలో కొందరు ఉన్నతాధికారులు, కీలక ప్రజా ప్రతినిధులు, మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలను, అవినీతి అక్రమాల ఆరోపణలు లేకుండా, అమలుపరిచిన అధికారిని, నిబంధనలో పాటించలేదనే ఆరోపణలపై అతడి విధి నిర్వహణ అడ్రస్ ను గల్లంతు చేయడం ( బదిలీ) పట్ల ఆ శాఖ పై వివిధ రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివరాలు ఇలా ఉన్నాయి.
ధర్మపురి మండలం తీగల ధర్మారం గ్రామంలోని దుర్గమ్మ ఆలయానికి విద్యుత్ వీధి దీపాల ఏర్పాటు కోసం కొందరు గ్రామస్తులు, కొంతకాలం క్రితం, కీలక ప్రజా ప్రతి నిధి ద్వారా సంబంధిత జిల్లా ఆ శాఖ ఉన్నతాధికారులకు వీధి దీపాల ఏర్పాటు కోసం సిఫారసు చేయించినట్టు సమాచారం. మౌఖికంగా ఆదేశాలు, చరవాణిలో సందేశాలతో ధర్మపురి విద్యుత్ శాఖను జిల్లాస్థాయి కొందరు ఉన్నతాధికారులు, ఏర్పాట్లపై ఆదేశించినట్టు తెలిసింది. స్థానిక విద్యుత్ సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికను వారి ఆదేశాలు పాటిస్తూ వీధి స్తంభాలు, దీపాలను దుర్గమ్మ గుడి వరకు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు కనుక చేసిన పని నియమ నిబంధనలను వారే రికార్డు చేస్తారని.A.E , సిబ్బంది భావించినట్టు చర్చ.
వీధి దీపాల ఏర్పాట్లు లో శాఖా పరమైన నిబంధనలను పాటించలేదని, కొందరు విద్యుత్ శాఖ కు ఫిర్యాదు చేశారు. కొంతకాలం తర్వాత విచారణ పేరిట అధికారులు హడావిడి చేసి గత నెల 13న ధర్మపురి విద్యుత్ A.E ధర్మపురి నుంచి బదిలీ చేసారు. ఇటీవల సంబంధించిన గోదావరి వరదల సందర్భంగాలో విద్యుత్ A.E. సిబ్బంది, నిద్రాహారాలు మాని వినియోగదారులకు అందించిన సేవలను, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు విస్మరించినా, వినియోగదారులు స్మరించుకుంటున్నారు. అనేక సందర్భాల్లో సబ్ స్టేషన్, నూతన స్తంభాలు వేయడం , తదితర మరమ్మతుల, పేరిట విద్యుత్ సరఫరాను నిలిపివేసి వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తూ విద్యుత్ శాఖకు విద్యుత్ ఆదాచేసిన సందర్భాలు అనేకం, వినియోగదారుల విమర్శలు చేసిన సందర్భాలు అనేకం. దుర్గమ్మ ఆలయానికి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు ఉదాంతల ను, ఉన్నతాధికారులకు, స్థానిక విద్యుత్ శాఖ సిబ్బంది, అధికారుల వివరించిన వారి అభ్యర్థన అరణ్య రోదనే అయినట్టు సమాచారం.
2 లక్షల 75 వేలు ఎవరు చెల్లించాలి ?.

గత నెల రోజుల క్రితం విద్యుత్ శాఖ కార్యాలయం వారు తీగల ధర్మారం గ్రామపంచాయతీ కి ,దుర్గమ్మ ఆలయానికి ఏర్పాటుచేసిన వీధి దీపాలకు సంబంధించిన డబ్బులు ₹ 2 లక్షల 75 వేల, 961 రూపాయలు చెల్లించాలని, (ఇందులో రిజిస్ట్రేషన్, SLC, డెవలప్మెంట్ , చార్జీలు సెక్యూరిటీ డిపాజిట్ల వివరాలు పేర్కొన్నట్టు సమాచారం) గ్రామపంచాయతీకి ఆదాయమే అంతతే.
విద్యుత్ శాఖకు డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుందో ? పంచాయతీ చెల్లిస్తుందో ? వేచి చూడాల్సిందే. ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేస్తే ప్రశంసల, పదోన్నతులు పొందకుండా బదిలీ పనిష్మెంట్ బాధాకరమని
ప్రజలు, వినియోగదారులు చర్చించుకుంటున్నారు,