J.SURENDER KUMAR.
ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నీ దర్శించుకుని ప్రత్యేక పూజల కోసం గురువారం రాత్రి శ్రీశ్రీశ్రీ శృంగేరి శివ గంగ పీఠాధిపతి జగద్గురు స్వామీజీ వచ్చారు. స్థానిక బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో, భక్తులు క్షేత్ర ప్రజలు, నంది విగ్రహం వద్ద మంగళారతులు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు తో స్వామివారి ఘనంగా స్వాగతించారు.

శుక్రవారం సాయంత్రం వరకు స్వామీజీ క్షేత్రంలోని బ్రాహ్మణ సంఘ భవనంలో భక్తి ప్రవచనాలు అనుగ్రహ సంభాషణ చేస్తారు.

జగద్గురువులను దర్శించి శారదా చంద్రమౌళీశ్వర పూజలో పాల్గొని పాదపూజలు, భిక్షవందనం చేయు అవకాశం భక్తులకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
