👉రేషనలైజేషన్ పేరుతో ఐసిటిసి కేంద్రాల కుదింపు కేంద్రం చర్యలు !
👉 ఆమడ దూరంలో ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు..
👉 చాప కింద నీరులాగా “ఎయిడ్స్” మరింత విస్తరించే ప్రమాదం ?
👉 రాష్ట్రంలో 40 దేశంలో 593 ఐసిటిసి కేంద్రాల కుదింపుకు రంగం సిద్ధం!
J.SURENDER KUMAR,
తెలంగాణ లో ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ కౌన్సిలింగ్ కేంద్రాలు కొన్నింటిని మూసి వేయడానికి రంగం సిద్ధం అయింది. రేషనలైజేషన్ పేరుతో ఐసిటిసి కేంద్రాల కుదింపు చర్యలకు. కేంద్రం శ్రీకారం చుట్టింది.
జూలై 5 న న్యాకో జారీ చేసిన సర్కులర్ 11025 పట్ల ఎయిడ్స్ రోగులు, ఆ సంస్థ సిబ్బంది అయోమయానికి గురవుతు ఆందోళన చెందుతున్నారు.
ఐసిటిసి కేంద్రాల సేవలు…

ప్రపంచ దేశాలను గడగడలాడించిన మహమ్మారిగా పేరున్న హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో ఉన్న వివక్షతలను పారద్రోలి, రోగులలో మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని కౌన్సిలింగ్ స్కిల్స్ తో సుశిక్షితులైన నిష్ణానితులైన కౌన్సిలర్స్ సేవలు అందించడం, రేషనలైజేషన్ అయితే అలాంటి సేవలు ఆమడ దూరం కానున్నాయి. పరీక్షలు చేయించుకోవడానికి అందుబాటులో ఐసీటీసీ కేంద్రాలు లేకపోవడం వల్ల, సదరు హెచ్ఐవీ, అనుమానిత, హై రిస్క్ గ్రూప్, సంక్రమిత వ్యక్తుల ద్వారా చాప కింద నీరు లాగా సమాజంలో ఎయిడ్స్ వ్యాధి మరింతగా ప్రబలే ప్రమాదం ఉందనే ఆందోళన నెలకొంది.
18 సంవత్సరాలుగా అందుబాటులో సేవలు!

2005 సంవత్సరం నుంచి ప్రతి సామాజిక ఆరోగ్య ఆసుపత్రిలలో ఐసీటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసి హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ, కౌన్సిలింగ్ సేవలను అందిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రోగులకు హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ, సలహాలు, సూచనలతో పాటు ఇతర అవకాశవాద రోగాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు వివరిస్తూ, కౌన్సిలర్లు తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. జనరల్ వ్యక్తులు, రిస్క్ ఉన్నవారు, ప్రతి గర్భిణీకి, శస్త్ర చికిత్సల సందర్భంగా హెచ్ఐవీ వ్యాధి నిర్ధారణ పరీక్షలను శిక్షణ పొందిన ల్యాబ్ టెక్నీషియన్లు మూడు దశలలో పలు టెస్ట్ కిట్లతో ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ (ఐసీటీసీ) లలో కన్ఫర్మేషన్ టెస్టులను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పల్లెల్లోని ఐసిటీసి కేంద్రాలలో గల కౌన్సిలర్, ల్యాబ్ టెక్నీషియన్లను ఏరియా, జిల్లా కేంద్ర ఆస్పత్రులలో గల ఐసీటీసీ కేంద్రాల్లో సర్దుబాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ వల్ల పల్లె ప్రాంతాల్లోని రోగులకు వైద్య సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, కౌన్సిలింగ్ సేవలు చేరువలో లభించక రోగులు అనేక అవస్థలు అనుభవించే పరిస్థితి నెలకొననున్నది.

ఆర్థికంగా చితికి పోయే దుస్థితి ఎదురు కానున్నది. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి సామాజిక ఆరోగ్య కేంద్రాలలో గల ఐసిటిసి కేంద్రాలను యధా తధా స్థితిని కొనసాగించాలని ఉద్యోగులు, రోగులు, ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐసీటీసీ కేంద్రాలలో పనిచేస్తున్న కౌన్సిలర్లను, ల్యాబ్ టెక్నీషియన్లను జాతీయ ఆరోగ్య మిషన్ కింద వివిధ ఆరోగ్య, కుటుంబ సంక్షేమం పథకాలు అవగాహన, ప్రజా చైతన్య కార్యక్రమాలకు వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
రేషనలైజేషన్ తో రాష్ట్రంలో 40, దేశంలో 593 కుదింపు!

రేషనలైజేషన్ పేరుతో ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ పరీక్ష, కౌన్సిలింగ్ (ఐసీటీసీ) కేంద్రాలను కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (న్యాకో) ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
దేశం లో వివిధ రాష్ట్రాలలో దాదాపు 593 ఐసిటిసి కేంద్రాలు, తెలంగాణ లో 40 సమీకృత సలహా మరియు పరీక్ష కేంద్రాలు (ఐసిటిసిలు) మూతపడనున్నాయి.
తెలంగాణలో 40 కేంద్రాలు ఇవే …
భూపాలపల్లి జిల్లాలో ఉన్న రెండు ఐసీటీసీ కేంద్రాలను రేషనలైజేషన్ పేరిట ఎత్తి వేయనుండడంతో ఆ జిల్లాలో హెచ్ఐవి, ఎయిడ్స్ నియంత్రణ సేవలు శూన్యం కానున్నాయి. జయశంకర్ , భూపాలపల్లి జిల్లాలో గల రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోని రెండు ఐసీటీసీ కేంద్రాలు మహాదేవపూర్, చిట్యాల.
తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ మూడు రాష్ట్రాలకు సరిహద్దులో కాళేశ్వరం, అంతర్ రాష్ట్ర త్రివేణి వంతెన మీదుగా దట్టమైన దండకారణ్య గిరిజన తాండవాసులకు మహాదేవ పూర్ ఐసీటీసీ కేంద్రం సేవలు అందిస్తున్నది. భూపాలపల్లి జిల్లా కేంద్ర ఆస్పత్రి మెడికల్ కాలేజీ గా అవతరించనున్నప్పటికీ భూపాలపల్లిలో ఐసిటిసి కేంద్రం సేవలు లేకపోవడం గమనార్హం.
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్, ఆదిలాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రి. మంచిర్యాల జిల్లాలో చెన్నూర్, మందమర్రి. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్. నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, మర్రిగూడ. సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు. మహబూబ్ నగర్ జిల్లాలో బడేపల్లి. వికారాబాద్ జిల్లాలో కొడంగల్, తాండూర్. రంగారెడ్డి జిల్లాలో అమంగల్. నాగర్ కర్నూల్ జిల్లాలో కల్వకుర్తి. మెదక్ జిల్లాలో రామాయంపేట, తూప్రాన్. సంగారెడ్డి జిల్లాలో ఆందోల్, జోగిపేట్, సదాశివపేట. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక. రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం, హయత్ నగర్, యాచారం, మార్పల్లి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ. హైదరాబాద్ జిల్లాలో జంగం మెట్, ఐపిఎం నారాయణగూడ, పానీపూర, శాలిబండ, సిఆర్పిఎఫ్, ఆర్టీసీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, అంబర్ పేట్, సుల్తాన్ బజార్, లాలాపేట్, బర్కాస్. మహబూబ్ జిల్లాలో గూడూరు. వరంగల్ జిల్లాలో సికేఎం మేటర్నిటీ హాస్పటల్ లలో గల ఐసీటీసీ కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కలిసికట్టుగా కేంద్రం ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలో ఐసిటీసీ కేంద్రాలు. చర్యలు చేపట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.