ఆలయాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది…

మంత్రి కొప్పుల ఈశ్వర్!

J.SURENDER KUMAR

రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తున్ననదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం మల్యాల మండలం కొండగట్టు ఆలయానికి నీటి సౌకర్యం కోసం ఎత్తిపోతల పథకం పనులకు భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొండగట్టు ఆలయ అభివృద్దికి ముఖ్యమంత్రి ప్రకటించిన కార్యక్రమంలో భాగంగా ₹13.43 కోట్లతో ముగ్దూం పేట గ్రామ సమీపంలోని ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుండి నీటినీ గుట్టపైకి ఎత్తిపోసే పనులను ప్రారంభించి రానున్న 2-3 నెలల్లో పూర్తీ చేసి భక్తులకు శాశ్వత పరిష్కారం కల్పించనున్నామని తెలిపారు. రాష్ట్రంలోని పుణ్య క్షేత్రాలను అద్బుతంగా తీర్చి దిద్ది భక్తులకు మెరుగైన సౌకర్యాన్ని కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వందేనని అన్నారు. కొండగట్టుకు ఎండాకాలంలో వచ్చే భక్తులకు నీటి కష్టాలు దూరం అవుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణయాలకు అనుగుణంగా దశల వారీగా ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ భక్తులకు సదుపాయాలు కల్పిస్తున్నామని, స్థానిక శాసన సభ్యుల విజ్ఞప్తి మేరకు పనులు చేపడుతున్నట్టు మంత్రి అన్నారు.

ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ

గత ఫిబ్రవరి 15 న రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో కొండగట్టు ఆలయానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి సౌకర్యాన్ని కల్పించాలనే ఆదేశాల మేరకు పనులు చేపట్టడం జరుగుతున్నదని అన్నారు. వరద కాలువ రివర్స్ పంపింగ్ ద్వారా నీటినీ ఎత్తిపోయడం జరుగుతుందని అన్నారు. ఈ ఎత్తిపోతల ద్వారా భక్తులకు నీటి వసతి సౌకర్యాలను కల్పిస్తున్నామని అన్నారు.

చొప్పదండి శాసన సభ్యులు సుంకే రవి శంకర్ మాట్లాడుతూ

కొండగట్టు ఆలయ అభివృద్దికి వంద కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి ప్రకటించారని, ఆలయ అభివృద్దిలో భాగంగా మొదట భక్తులకు నీటి సౌకర్యం కల్పించడానికి ఎత్తిపోతల పనులకు పునాది వేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఎల్. రమణ, జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, సర్పంచ్ తిరుపతి రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, DCMS చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, జెడ్పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచులు, స్థానిక అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.