ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే  బిజెపి పదవులలో పెద్దపీట !


ఆయా రాష్ట్రాలలో పునర్నిర్మాణంలో బిజెపి ?


J.SURENDER KUMAR,


ఇటీవల ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికే   పదవుల కేటాయింపులో పెద్దపీట వేశారు.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) పునర్నిర్మాణం కసరత్తులో భాగంగా మంగళవారం అనేక రాష్ట్రాలకు నూతన పార్టీ అధ్యక్షులను నియమించింది. నాలుగు రాష్ట్రాలకు కొత్త చీఫ్‌లను నియమించారు.  పదవులు పొందిన వారిలో  – సునీల్ జాఖర్, డి పురందేశ్వరి – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ( గతంలో కాంగ్రెస్, పార్టీ నుంచి,)  ఈటెల రాజేందర్ – ( బిఆర్ఎస్ నుంచి చేరినా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా విజయ సాధించారు)

బిజెపి పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించిన అధ్యక్షుల మరియు పదవులు కేటాయించిన  వివరాలు !


👉 తెలంగాణ బీజేపీ చీఫ్‌ గా  కేంద్రమంత్రి  కిషన్‌రెడ్డి ,
👉 తెలంగాణలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్‌పర్సన్‌గా ఈటెల రాజేందర్‌,
👉 ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి .
👉 బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,
👉 బీజేపీ పంజాబ్ చీఫ్‌గా సునీల్ జాఖర్, నియమితులయ్యారు.
👉 జార్ఖండ్ బీజేపీ చీఫ్‌గా బాబులాల్ మరాండీ
!

కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు, మరియు వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ

గత ఏడాది కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి చేరిన సీనియర్‌ సునీల్‌ జాఖర్‌ పంజాబ్‌  గతంలో రాష్ట్ర యూనిట్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్నారు.


బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యునిగా  మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజేపీలో చేరారు. తెలంగాణా చీఫ్‌గా కిషన్‌రెడ్డిని నియమించడం వల్ల కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో అతను పర్యాటక శాఖ నుండి వైదొలగే అవకాశం ఉంది.

మరాండి ప్రస్తుతం జార్ఖండ్‌లో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు.

కర్నాటక ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత, రాబోయే రాష్ట్ర మరియు సార్వత్రిక ఎన్నికలకు బిజెపి కసరత్తుకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం. జూలై 7న అన్ని రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌చార్జుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అధ్యక్షత వహించనున్నారు.