రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్న బీఆర్ఎస్ – ఉచిత విద్యుత్ ఆలోచన కాంగ్రెస్ పార్టీదే !

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

J. SURENDER KUMAR,

ఎన్ఆర్ఐలతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ ఏ మేరకు అవసరమో వివరిస్తే దాన్ని బీఆర్ఎస్ నాయకులు వక్రీకరించారని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మంగళవారం ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు వక్రీకరించడాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తప్పుబట్టారు. ఉచిత విద్యుత్ ఆలోచన కాంగ్రెస్ పార్టీదని స్పష్టం చేశారు.


రైతుల ఆర్థిక భారం పడకుండా ఆదుకోవాలని సంకల్పంతో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభించామని, దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి
సీఎంగా మొట్ట మొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైలు పై చేశారనీ గుర్తు చేశారు.
ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేసిన నాయకుల చెంప చెల్లుమానేలా వైఎస్ చేసి చూపెట్టాడని తెలిపారు.
పదేళ్లపాటు రెండు దశల్లో
9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్ఫార్మర్ వారీగా ఏ మేరకు 24 గంటలు విధ్యుత్ సరఫరా చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రైతులు రొడ్డేక్కితేగానీ రిపేర్ చేయలేదనీ గుర్తు చేశారు.
తాను శాసన సభలో మాట్లాడి జగిత్యాలకు ప్రత్యేకంగా 200 ట్రాన్సఫార్మర్లు తెప్పించామని జీవన్ రెడ్డి వివరించారు.
కాంగ్రెస్ పాలనలో పండించిన పంటను కల్లంకాడ తప్పా, తాలు లేకుండా కొనుగోలు చేశామని,
ఏక మొత్తంలో రైతులకు రుణ మాఫీ చేశామని, ఎన్నికల్లో వాగ్దానం చేయకపోయినా రైతుల విద్యుత్ బకాయిలు మాఫీ చేశామని ఆయన గుర్తు చేశారు.
బీఅర్ఎస్ పాలనలో క్వింటాల్ కు 5 కిలోల కోతతో ప్రతి రైతు ఎకరానికి రెండు వేలు రైతులు నష్టపోయారని, రైతుబందు నెపంతో ఉమ్మడి రాష్ట్రంలోనీ విత్తన రాయితీ, వడ్డీ రాయితీ, వ్యవసాయ పరికరాలపై రాయితీ నిలిపి వేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
వరంగల్ డిక్లరేషన్ లో పేర్కొన్నట్లు రైతు బంధు పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు.
వరికి మద్దతు ధరకు అనుగుణంగా అదనంగా రు.500 కల్పిస్తామని అన్నారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వక్రీకరించి, నిరసనలు చేస్తారా అని బీఆర్ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణ మాఫీ చేయనందుకు, వడ్డీ రాయితీ నిలిపి వేసినందుకు ధర్నాలు చేయమంటారా అని బీఆర్ఎస్ నాయకుల తీరుపై చురకాలంటించారు.
24 గంటలు నాణ్యమైన విద్యుత్ కల్పించడం కాంగ్రెస్ బాధ్యతగా తీసుకుంటుందన్నారు.
విద్యుత్ యూనిట్ కు రు.4 ఉంటే, యూనిట్ కు రు.16చొప్పున కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రజల పై భారం వేస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్ర విభజన చట్టంలో 4వేల మెగా వాట్లా విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం అనుమతి ఇస్తే, పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించలేని సీఎంకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్, పీసిసి సభ్యులు గిరి నాగ భూషణం, టీపిసిసి నేత బండ శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయ లక్ష్మి దేవేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు గాజంగి నందయ్య, బీరుపూర్ ఎంపీపీ మసర్తి రమేష్, జున్ను రాజేందర్, చందా రాధాకిషన్, కొండ్ర రాంచంద్రా రెడ్డి, నవీన్ రావు, లక్ష్మణ్ రావు, చాంద్ పాషా, మన్సూర్, నేహాల్ , పుప్పాల అశోక్, మునిందర్ రెడ్డి, గుంటి జగదీశ్వర్, గుడిసె జితేందర్ యాదవ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండా మధు, బీరం రాజేష్, మహిపాల్, లైసేట్టి విజయ్, అతాహుల్ల తదితరులు పాల్గొన్నారు.