J.SURENDER KUMAR.
అకాల వర్షాలకు గోదావరి నదిని ఆనుకొని ఉన్న ఎకరా, అర ఎకర భూమిని సాగు చేసుకుంటున్న చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
ధర్మపురి మండలం జైన, దమ్మన్నపేట, ధర్మపురి లో వరద ముంపుకు గురి అయిన పంట పొలాలను శనివారం ఆయన పర్యటించి నష్టపోయిన రైతులకు ముచ్చటించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.
గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు పొలాలన్నీ ఇసుక మేటలు వేసి తీవ్రంగా నష్టపోవడం జరిగిందని, మంత్రి కొప్పుల ఈశ్వర్ నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించడం జరిగిందే తప్ప అది ఆచరణలో ఎక్కడ అమలు కాలేదని, ఆరోపించారు.

నియోజకవర్గంలో ఉన్న చిన్న, సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్న పొలాల నష్టం పైన అధికారుల ద్వారా నివేదిక తెప్పించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మంత్రి కొప్పుల ఈశ్వర్ పై ఉందన్నారు. ,కుల సంఘాలకు ప్రొసీడింగ్స్ ఇచ్చిన విధంగా నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారాన్ని అందించాలని, గత సంవత్సరం ఎలాగో రైతులకు నష్టపరిహారం ఇప్పించలేదని, కనీసం ఇప్పుడైనా రైతుల పొలాల వద్దకే నేరుగా వెళ్లి వారి నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
లక్ష్మణ్ కుమార్ వెంట కాంగ్రెస్ నాయకులు ఎల్.డి.ఎం నియోజకవర్గ ఇంచార్జి శ్రీకాంత్, బ్లాక్ కాంగ్రెస్ 2 అద్యక్షులు ఎంపిటిసి సుధాకర్, ధర్మపురి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాందెని మొగిలి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, జైన ఉప సర్పంచ్ శ్రీనివాస్, కస్తూరి శ్రీనివాస్, ఆశెట్టీ శ్రీనివాస్, భూమేష్, మధుకర్, గణేష్, దూడ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.