తెలుగు మీడియా రంగంలో ఆవిర్భవించిన ఆశాజ్యోతి సుమన్ దూది!

👉 సుమన్ టీవీ ఆఫీస్ కి వెళ్ళి అభినందించిన IJU అధినేత కే. శ్రీనివాస్ రెడ్డి !

J.SURENDER KUMAR

ప్రస్తుతం తెలుగు మీడియా రంగంలో కొన్ని యాజమాన్యాలు తమ సంస్థలో కొనసాగుతున్న జర్నలిస్టుల శ్రమశక్తిని శక్తి వంచన లేకుండా దోచుకుంటున్న, ప్రస్తుత తరుణంలో జర్నలిస్టుల పాలిట ఆశాజ్యోతి ఆవిర్భవించిన సుమన్ దూది (సుమన్ టీవీ యజమాని) నీ మిగతా మీడియా సంస్థలు ఆదర్శంగా తీసుకుంటే జర్నలిస్టులకు, ప్రత్యేకంగా గ్రామీణ జర్నలిస్టులకు న్యాయం జరుగుతుంది అనే ఆశ చిగురిస్తున్నది. తన సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను తెలుసుకొని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్. అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి విరహత్, తదితర నాయకులు శుక్రవారం సుమన్ టీవీ కార్యాలయానికి వెళ్లి అధినేతను అభినందించారు అంటే, సుమన్ విశాల హృదయాన్ని అర్థం చేసుకోవచ్చు.


👉 శ్రమ శక్తి దోపిడీ ఇలా….

మీడియా సంస్థల ఆవిర్భవించిన రోజు వచ్చిందంటే, వస్తుందంటే చాలు మీడియా సంస్థలు జర్నలిస్టులకు విధించే టార్గెట్లు అంతా ఇంతా కాదు… మన సంస్థ కోసం  యాడ్స్ కలెక్ట్ చేయండి అంటూ, పల్లె ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ప్రతి సెంటర్ కు ఇంత అంటూ టార్గెట్లు ఫిక్స్ చేసి ముందస్తుగానే వారి నుంచి డబ్బులు డిపాజిట్ చేయించుకోవడం, షరా మామూలే.

పుట్టిన దినం, దశదిన దినం, ప్రారంభోత్సవాలు, కళ్యాణ మహోత్సవాలు   యాడ్స్ సేకరణ, పేపర్లకు సంవత్సర కాలానికి చందాలు కట్టించడం ( ఇందులో వాట్సాప్ లో వచ్చే పేపర్లకు)  సైతం తప్పనిసరి. మండల విలేఖరికి సర్కులేషన్, అడ్వర్టైజ్మెంట్, రిపోర్టింగ్, ఆ సంస్థ ఆర్. సి. సెంటర్ కిరాయి,విద్యుత్ బిల్లులు సైతం విధిగా కట్టుకోవాల్సిన దుస్థితినీ కొన్ని సంస్థలు సాంప్రదాయకంగా కొనసాగిస్తున్నా విషయం విధితమే. జర్నలిస్టుల శ్రమ శక్తిని  పీల్చి పిప్పి చేస్తూ. రాజభోగాల అనుభవిస్తున్న మీడియా రంగంలోని కొన్ని యజామాన్యాలకు కను విప్పు కల్గించే అంశం ఇది. డిజిటల్ మీడియా రంగంలో సంచలన నిర్ణయం తీసుకున్న సుమన్ టీవీ యాజమాన్యం మీడియా చరిత్రలోనే సువర్ణాధ్యాయం లిఖించింది.


తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంతృప్తికరమైన జీతాలు చెల్లిస్తుండడమే కాకుండా, మధ్యాన్న భోజన సౌకర్యం, పలువురు ఉద్యోగులకు ఖరీదైన కార్లు అందించి  ఆదర్శంగా నిలిచిన Suman Tv యాజమాన్యాన్ని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) అభినందించాయి. ఉద్యోగుల శ్రమకు తగ్గ వేతనాలు కూడా చెల్లించని యాజమాన్యాలు ఉన్న ఈ రోజుల్లో, Suman Tv యాజమాన్యం ఉద్యోగుల పట్ల చూపుతున్న ఔదర్యాన్ని ప్రశంసించాయి.    ఐజేయూ జాతీయ అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి  టీయూడబ్ల్యూజే  ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీలు బంజారాహిల్స్ లోని Suman Tv కార్యాలయానికి వెళ్లి, ఆ సంస్థ ఛైర్మెన్ సుమన్ కు పుష్పగుచ్ఛం  అందించి అభినందించారు.  భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో పనిచేయాలని వారు ఆశించారు.
ఆశాజ్యోతి గా అగుపిస్తున్న సుమన్ దూది నీ కొన్ని మీడియా సంస్థలు ఆదర్శంగా తీసుకొని  జర్నలిస్టులకు న్యాయం చేస్తారేమోనని ఆశలు ఆవిర్భవిస్తున్నాయి. అని జర్నలిస్టు లోకం ఆశిస్తున్నది.
కాగా తమకు మరింత ప్రోత్సాహాన్ని అందించిన  ఐజేయూ, టీయూడబ్ల్యూజే నేతలకు సంస్థ ఛైర్మెన్ సుమన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ.రాజేష్, హెచ్.యూ.జె అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, Suman tv భక్తి & లైఫ్ స్టయిల్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ తదితరులు పాల్గొన్నారు.