కాంగ్రెస్ పార్టీలో భారీగా యువకుల చేరిక..

J.SURENDER KUMAR.

ధర్మపురి మండలం లోని వివిధ గ్రామాల కు చెందిన భారీ సంఖ్యలో యువకులు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ధర్మపురి పట్టణంలోని ఎస్ హెచ్ ఫంక్షన్ హాల్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా స్వాగతించారు.

రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం యువత కృషి చేయాలని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్, యువకులకు వివరించారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి ఘన స్వాగతం !
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ధర్మపురిలో బైక్ ర్యాలీతో స్వాగతించారు.


ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘనభట్ల దినేష్ ,గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిశాంత్ రెడ్డి, పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాములు గౌడ్, బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుభాష్, ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధు, ఉపాధ్యక్షులు విజయ్, ధర్మపురి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొగిలి, వెల్గటూర్ మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్, బ్లాక్ కాంగ్రెస్ 2 అధ్యక్షులు కుంట సుధాకర్, పార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు