👉 డిప్యూటేషన్ పై వచ్చారు. దశాబ్ద కాలంగా తిష్ట వేసి ఉన్నారు.
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం డిప్యూటేషన్ ఉద్యోగుల పాలిట వరంగా మారింది అనే చర్చ నెలకొంది. మేనేజర్ స్థాయి అధికారి పర్యవేక్షణలోని ఆలయాలలో (తొలిసారి అపాయింట్మెంట్ అయిన ఆలయం) ఉద్యోగులు డిప్యూటేషన్ లపై కొండగట్టు ఆలయానికి వచ్చి వారు దశాబ్ద కాలంకు పైగా ఇక్కడే తిష్ట వేయడంతో తాము ప్రమోషన్లు కోల్పోతున్నామని ఆయా ఆలయాలలో నీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.
వివిధ ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల, పదోన్నతుల కల్పన కోసం గత కొన్ని రోజుల క్రితం దేవాదాయ శాఖ ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సీనియార్టీ ఉండి గ్రేడు- 2, గ్రేడ్- 1, ఏ సీ, డి సి ల గ్రేడ్ – 1 ఈవోలు ఏసీలు గా పదోన్నతుల కోసం D.P. C.( డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ) కసరత్తు కు శ్రీకారం చుట్టడంతో. కొందరు ఉద్యోగులు పైరవీల ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొండగట్టు ఆలయంలో పదోన్నతిపై పోస్టింగ్ కోసం అర్హత ఉన్న ఉద్యోగి ప్రయత్నిస్తుండగా అదే పోస్టులో కొందరు కొనసాగుతున్నారని అధికారులు వివరించినట్లు సమాచారం. దీంతో ఆ ఉద్యోగి ఆయా ఆలయాల క్యాడర్ స్తెంత్, ( cadres strength ) వివరాలతో పాటు గతంలో జరిగిన బదిలీలో, పదోన్నతుల వివరాలు సేకరించినట్లు తెలిసింది.
దీంతో గత పది సంవత్సరాల కాలం కు పైగా ఇద్దరు ఉద్యోగులు కొండగట్టు. ఆలయానికి డిప్యూటేషన్ వచ్చి పదోన్నతులు పొంది ఇక్కడే విధులలో కొనసాగుతున్న విషయం తెలిసింది.
ఆదిలాబాద్ జిల్లా నుంచి..
ప్రస్తుతం మంచిర్యాల జిల్లా, చెన్నూరు పట్టణంలోని శ్రీ మదన పోచమ్మ ఆలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని లేఖ సంఖ్య. C 2/1208/2012, తేదీ 22/02/2012. న దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్, ఉద్యోగిని కొండగట్టు ఆలయానికి డిప్యూటేషన్ పై పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 11 సంవత్సరాలుగా ఆ ఉద్యోగి కొండగట్టు ఆలయంలోనే విధుల్లో కొనసాగుతున్నాడు.
కరీంనగర్ జిల్లా నుంచి..
కరీంనగర్ జిల్లా కేంద్ర సమీపంలోని కోతి రాంపూర్, గిద్దె పెరుమాళ్ ఆలయ జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని లేఖ సంఖ్య. C2 / 7704 / 2009, తేదీ 3-03-2009 లేఖ ద్వారా కొండగట్టు ఆలయానికి డిప్యూటేషన్ పై పంపిస్తూ విజిలెన్స్ అధికారిని ఉత్తర్వులు జారీ చేశారు. గత 14 సంవత్సరాలుగా ఉద్యోగి కొండగట్టుఆలయంలో కొనసాగుతున్నారు.
కమిషనర్ ఉత్తర్వులు అడ్డుపెట్టుకొని…

ఇదిలా ఉండగా అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ కే. శివశంకర్, లేఖ సంఖ్య
B 3 /9300/ 2018, తేదీ 4-08- 2018 న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను ఆదేశిస్తూ జారీచేసిన ఓ సర్కులర్ లో మీ మీ ఆలయాలలో డిప్యూటేషన్లపై కొనసాగుతున్న ఉద్యోగులను, కమిషనర్ అనుమతి, ముందస్తు సమాచారం లేకుండా తిరిగి పంపించరాదని, అందులో పేర్కొన్నారు. అర్చక ,ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా అర్హత కలిగిన ఉద్యోగులు క్రమబద్ధీకరణ నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసినట్టు అందులో పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా డిప్యూటేషన్ పై వచ్చిన ఉద్యోగులు మాతృ సంస్థ ఆలయంలో ప్రమోషన్ కు అర్హత ఉండి ఖాళీగా ఉంటే క్యాడర్ స్తెంత్ ( cadres strength ) నిబంధన ల మేరకు అక్కడే పదోన్నతి పొందాలి తప్ప, డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్న ఆలయంలో పదోన్నతి పొందరాదు అనేది సర్వీస్ నిబంధన గా చర్చ. దీనికి తోడు కొండగట్టు ఆలయంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటేషన్ ఉద్యోగి కి దేవాదాయ శాఖ B 3/1095/2017. తేదీ 2/02/2017 న జారీ చేసిన ఉత్తర్వులలో డిప్యూటేషన్ కాలాన్ని 1-04- 2017 నుంచి 31-03-2019, రెండు సంవత్సరాల వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలా ఉండగా ధర్మపురి, గూడెం, వేములవాడ, దుబ్బ రాజన్న, తదితర ఆలయాల్లో డిప్యూటేషన్ పై కొనసాగుతున్న ఉద్యోగులు, మాతృ సంస్థలో విధులు నిర్వహిస్తున్న వారు ప్రమోషన్లు కోల్పోతున్నారని, సమగ్ర సమాచారంతో లోకాయుక్త లో ఆ ఉద్యోగి ఫిర్యాదు చేయడానికి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
త్వరలో అసిస్టెంట్ కమిషనర్ ల పదోన్నతులు ?
గత కొంతకాలంగా దేవాలయ శాఖ ఉద్యోగుల పదోన్నతుల్లో గందరగోళానికి తెరపడినట్టు సమాచారం. అసిస్టెంట్ కమిషనర్ ల పదోన్నతుల కోసం డి పి సి ( Department promotion committee ) ఏర్పడినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి, దేవాదాయ కమిషనర్ అనుమతితో ఈ కమిటీ సమావేశమై గ్రేడ్ – ఎగ్జిక్యూటివ్ అధికారులను , ఏ.సీ లుగా పదోన్నతుల కోసం ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. గ్రేడ్ 2 ఈవోలు గ్రేడ్ – 1 ఈ.వోలుగా పదోన్నతులు పొందుతారు. డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్నవారు రీజనల్ జాయింట్ కమిషనర్ లు గా పదోన్నతులు పొందుతారు.
మొదలైన పైరవీలు..
భారీ ఆదాయం, ఆస్తులు గల ఆలయాలకు కార్యనిర్వహణాధికారులుగా ( అసిస్టెంట్ కమిషనర్ ) పరిపాలన నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో కొందరు గ్రేడ్- 1 కార్యనిర్వహణాధికారులు పైరవీలకు శ్రీకారం చుట్టినట్టు చర్చ నెలకొంది.. రాజకీయ అండదండలు లేని కొందరు ఉద్యోగులు, పదోన్నతులు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగడానికి హైకోర్టు న్యాయవాదులను సంప్రదిస్తున్నట్టు చర్చ .