J.SURENDER KUMAR,
విధి నిర్వహణలో అంకితభావంతో సేవలను అందించిన, ఏఎస్ఐ రాజ మల్లయ్య (2043) అకాల మరణం పోలీస్ శాఖకు తీరనిలోటు అని, ఆ కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని జగిత్యాల జిల్లా ఎస్పి భాస్కర్ అన్నారు.

వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ASI రాజ మల్లయ్య అస్వస్థతకు గురియై కరీంనగర్ ఆసుపత్రి లో ఆదివారం మృతి చెందారు. సోమవారం స్వ గ్రామైన ధర్మపురి లో ASI భౌతిక కాయానికి ఎస్పి, ధర్మపురి సిఐ రమణ మూర్తి, వెలగటూర్, ధర్మపురి, బుగ్గారం, బీర్పూర్, సారంగాపూర్, జగిత్యాల డివిజన్ పోలీసు అధికారులు సిబ్బంది పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఎస్పి ASI కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి మీ కుటుంబానికి ఎల్లవేళలా పోలీస్ శాఖ అండగా ఉంటుందని వారికి మనోధైర్యాన్ని కల్పించారు