అదనపు కలెక్టర్ బి ఎస్ లత !
J.SURENDER KUMAR.
ఈనెల 30 లోగా CMR చెల్లింపులు పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టర్ కార్యాలయ సమవేశం మందిరంలో వానాకాలము 2021-22, యాసంగి 2021-22 మరియు వానాకాలము, 2022-23 కి సంబందించిన CMR చెల్లింపులలో పురోగతి తక్కువ ఉన్న రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశము నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం 2022-23 CMR చెల్లింపులలో పురోగతి తక్కువగా ఉన్నందున ప్రభుత్వం నిర్దేశించిన 30.09.2023 గడువు తేదిలోగా CMR చెల్లింపులు పూర్తి చేయాలని, వానాకాలం 2021-22 & యాసంగి 2021-22. సీజన్ లకు సంబంధించిన బకాయిలు త్వరితగతిన చెల్లించాలని అదేశించినారు.

తదుపరి దీనికి సంబంధించి పౌరసరఫరాల క్షేత్రస్థాయి సిబ్బందికి రోజువారీ లక్ష్యం ప్రకారము వారి పరిధిలోని మిల్లుల నుండి CMR డెలివరీలు చేయించాలని, ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అలానే FCI అధికారులు CMR గోడౌన్ లలో అవసరమైన స్థలాన్ని ఏర్పాటు చేయాలని మరియు SWC వారు గోడౌన్ నకు వచ్చు స్టాక్స్ దిగుమతి చేసుకొనుటకు సరిపడు హమలిలను సమకూర్చుకోవాలని అదేశించినారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరా అధికారి & జిల్లా మేనేజర్ పౌరసరఫరా సంస్థ ఇంచార్జ్ సి. వెంకటేశ్వర్ రావు, నాయబ్ తహశీల్దార్లు, పౌరసరఫరా క్షేత్రస్థాయి సిబ్బంది మరియు మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు.